Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ బాబును క‌డిగేశారుగా!

By:  Tupaki Desk   |   16 Aug 2017 9:54 AM GMT
ముద్ర‌గ‌డ బాబును క‌డిగేశారుగా!
X
కాపు ఉద్య‌మ నేత‌ - మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌డిగిపారేశారు. త‌న వెనుక ఏవో శ‌క్తులు ఉన్నాయ‌ని - అందుకే తాను అలా ప్ర‌వ‌ర్తిస్తున్నాన‌ని టీడీపీ నేత‌లు అన‌డాన్ని ముద్ర‌గ‌డ తీవ్రంగా తిప్పికొట్టారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు హామీలు చెప్పి.. ఓట్లు వేయించుకున్నార‌ని, ఇప్పుడు ఆ హామీల‌నే తీర్చాల‌ని తాను కోరుతున్నాన‌ని ముద్ర‌గ‌డ అన్నారు. దీనికి తామేదో దొంగ‌ల్లా - ఉగ్ర‌వాదుల్లా.. చంద్ర‌బాబుకు క‌నిపిస్తున్నామా? అని ప్ర‌శ్నించారు. త‌న వెనుక ఏదో శ‌క్తులు ఉన్నాయంటున్న చంద్ర‌బాబు.. గ‌తంలో కాంగ్రెస్‌ లో ఉన్న‌ప్పుడు ఉద్య‌మం న‌డిపించిన స‌మ‌యంలో త‌న‌కు బాబు ఎంత ముట్ట‌జెప్పారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌స్తుతం నిర‌వ‌ధిక పాద‌యాత్ర చేస్తాన‌ని య‌త్నిస్తున్నా.. కాపు జాతి ఆక‌లిని వినిపిస్తాన‌ని చెబుతున్నా.. త‌న‌ను ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ముద్ర‌గ‌డ ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి పాదయాత్ర చేయదలిస్తే న‌న్ను గృహ నిర్బంధంలో ఉంచుతారా? అని ప్ర‌శ్నించారు. ఈ నెల 14న కాపుల‌ను ఉద్ధ‌రించేందుకు చంద్ర‌బాబు ఏదో ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అనుకున్నా.. అది ఒట్టిద‌ని తేలిపోయింద‌ని, కాపు జాతికి చంద్ర‌బాబు చెవిలో పువ్వు పెట్టార‌ని ముద్ర‌గ‌డ విరుచుకుప‌డ్డారు.

తాను , త‌న కాపు జాతి చేసే పాద‌యాత్ర అమ‌రావ‌తిని దోచుకునేందుకు కాద‌ని, గ‌తంలో త‌మ జాతికి బాబు ఇచ్చిన హామీల‌ను గుర్తు చేసేందుకేన‌ని చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు బుధ‌వారం ముద‌గ్ర‌డ తూర్పుగోదావ‌రిలోని కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. దీనికి ముందు పాద‌యాత్ర‌ను ప్రారంభించేందుకు ఇంటి నుంచి త‌న అనుచ‌రుల‌తో ఆయ‌న ముందుకు వ‌చ్చారు. అయితే, పోలీసులు అనుమ‌తి లేద‌ని అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ముద్ర‌గ‌డ తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు.

జ‌క్కంపూడిలో సీఎం ప‌ర్య‌టించేందుకు సెక్ష‌న్ 30 - 141 లు అడ్డురావా? అని ప్ర‌శ్నించారు. తమ జాతి ప్రజలను ఎండలో ఉంచి చంద్రబాబు సుఖాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. తమ జాతి ఆగ్రహాన్ని కచ్చితంగా చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందన్నారు. తమ కుమారుడు మంత్రి పదవి గురించి చంద్రబాబు తహతహలాడారే.. తమ జాతి రిజర్వేషన్ కోసం తహతహలాడటం తప్పా అని ప్రశ్నించారు. మ‌రి వీటికి బాబు అండ్ కో ఎలా స‌మాధానం చెబుతారో చూడాలి.