Begin typing your search above and press return to search.
ముద్రగడ ఘాటులేఖ: జగన్ నేనొకడిని ఉన్నా..గుర్తించుకో
By: Tupaki Desk | 11 Feb 2020 10:00 AM GMTకాపు రిజర్వేషన్ల పోరాట నేత ముద్రగడ పద్మనాభం - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా సత్సంబంధాలు ఉన్నాయి. కాపు ఉద్యమానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అందుకే ఆ ఉద్యమం అంత తీవ్రంగా కొనసాగింది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జాతిని కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి ఘాటు లేఖ రాశారు.
అయితే గతంలో కూడా ముద్రగడ ఏవేవో సమస్యలపై లేఖలు రాసి జగన్ దృష్టిలో పడేందుకు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుంచి ఓ లేఖ రాసి ముఖ్యమంత్రికి పంపారు. ఈసారి కాపు రిజర్వేషన్ గురించి మీరు హామీ ఇవ్వలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ ఫైల్ కేంద్రం వద్ద ఉందని.. దాని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని కోరారు. అడగక తప్పడం లేదని కూడా లేఖలో రాసుకొచ్చారు ముద్రగడ.
గత ప్రభుత్వంలో తాను వేధింపులకు గురయ్యానని - తన పిల్లలకు ఇవ్వడానికి ఆస్తిపాస్తులేమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కోసం తాను చాలా చేశానని.. గతంలో జరిగిన పలు ఘటనలను ఆయన లేఖలో పేర్కొన్నారు. ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి సహకరించి.. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యానని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేశానని.. పాదయాత్ర సందర్భంగా… రాజమండ్రి వంతెన మీద భారీ జనసమీకరణ చేశానని ఆయన వివరించారు. ఈ విషయమై మీ పార్టీ నాయకులను అడిగి తెలుసుకోవాలని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
గతంలో కాపు బీసీల్లో ఉండేవారని - ఆ తర్వాత మారడంతో తమ సామాజిక వర్గం ఎంతో ఇబ్బందులు పడ్డారని - ఇప్పుడు తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని.. తాము కోల్పోయిన బీసీ రిజర్వేషన్ ను కల్పించాలని కోరాడు. అయితే ఈ లేఖలో చేసిన కొన్ని వ్యాఖ్యలను పరిశీలిస్తే రాజకీయంగా - లేదా ప్రభుత్వం నుంచి తనకు ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ముద్రగడ్డను పట్టించుకోలేదు. ఆయన ఒకరు ఉన్నారని గుర్తించలేదు. అందుకే ముద్రగడ తరచూ లేఖలు రాస్తూ తాను ఉన్నట్లు జగన్ కు గుర్తుచేస్తున్నట్లు తెలుస్తోంది.