Begin typing your search above and press return to search.
బాబుపై ముద్రగడ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 7 Jun 2016 10:40 PM ISTకాపు ఉద్యమ నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన.. తాజాగా ఊహించని రీతిలో ఆరోపణలు చేశారు. అప్పుడెప్పుడో జరిగిన ఘటనల్ని తవ్వి తీసి మరీ.. నాటి ఘటనలకు బాధ్యుడు చంద్రబాబే అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుదు సంచలనంగా మారాయని చెప్పాలి. రాజకీయ మైలేజ్ కోసం చంద్రబాబు విపరీతంగా తపించారన్న ఆయన.. ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు.. పరిటాల రవి చనిపోయినప్పుడు విధ్వంసం సృష్టించాలని పిలుపునిచ్చారన్నారు.
పరిటాల రవిని చంపుతారన్న విషసయం చంద్రబాబుకు తెలిసి కూడా రాజకీయ మైలేజ్ కోసం పాకులాడారన్నారు. పరిటాల రవి చనిపోయినప్పుడు అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పెట్టి.. ‘తగలబెట్టండి’ అంటూ ఆదేశాలిచ్చిన్నట్లుగా ఆయన వ్యఖ్యనించారు. తుని ఘటనలో కేసులు ఉండవని చెప్పిన ఏపీ సర్కారు మాట తప్పి అరెస్ట్ లకు పాల్పడుతోందన్న ముద్రగడ.. కాపుల్లో కులాల్ని విడదీసి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. రాజమండ్రి పుష్కర పాపం కూడా చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. బాధతో అంటున్నారో.. ఆవేదనతో అన్నేసి మాటలు అంటున్న ముద్రగడ.. ఆ మధ్యన చంద్రబాబును అంతలా ఎందుకు పొగిడినట్లు?ఒకవేళ ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు.. పరిటాల రవి హత్యకు గురైనప్పుడు విధ్వంసం సృష్టించమని చెబితే.. బాధ్యత కలిగిన నేతగా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ముద్రగడ ఎందుకు నిలదీయలేదో..?