Begin typing your search above and press return to search.
ఇవాళ ముద్రగడకు ప్లూయిడ్స్ ఎక్కించాల్సిందేనా?
By: Tupaki Desk | 12 Jun 2016 4:32 AM GMTతుని విధ్వంసకాండలో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్ని వెంటనే విడుదల చేయాలని.. తుని ఘటనపై అరెస్ట్ లు చేయకూడదంటూ నిరసన చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష షురూ చేసి మూడు రోజులు పూర్తి అయి.. నాలుగో రోజులోకి వచ్చింది. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆయన... వైద్య సేవలకు నో చెబుతున్నారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా క్షీణిస్తోంది.
ఆయనకు బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులకు చుక్కలు చూపిస్తున్న ముద్రగడ తీరుతో వైద్యులు భయపడిపోతున్నారు. ఆయనకు ఆయన సమ్మతిని వ్యక్తం చేసే వరకూ వైద్యం చేసేందుకు ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని వారు ఒప్పుకుంటున్నారు. గడిచిన మూడు రోజులుగా ఏమీ తీసుకోని ముద్రగడ తీరుతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఈ రోజు (ఆదివారం) ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ముద్రగడకు షుగర్ తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈరోజు బలవంతంగా అయినా సరే వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని.. లేకుంటే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ రోజు కూడా ఆయన దీక్షను కొనసాగిస్తే.. ఆయన మూత్రపిండాలకు ప్రమాదం తప్పదంటున్నారు.