Begin typing your search above and press return to search.

ముద్రగడ ...ఆ పార్టీ నుంచే....అంతా వ్యూహాత్మకమే...?

By:  Tupaki Desk   |   23 Jun 2023 10:00 PM GMT
ముద్రగడ ...ఆ పార్టీ నుంచే....అంతా వ్యూహాత్మకమే...?
X
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేసే విషయం ఫిక్స్ అయినట్లే అంటున్నారు ఈ మేరకు లెటర్ ద్వారా ఆయన తన మనసులో మాటను చెప్పేశారు. పవన్నే తనతో పోటీ చేయమని కూడా సవాల్ చేసారు. ఇదిలా ఉంటే ముద్రగడ వైసీపీ నుంచే పోటీ చేస్తారా అంటే అదే నిజమని ప్రచారం సాగుతోంది. నిజానికి చాన్నాళ్ళ క్రితమే వైసీపీ నేతలు పలువురు ముద్రగడను కలసి వచ్చారు. ఆయన్ని వైసీపీలో చేరమని కూడా వారు కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

ముద్రగడకు కాకినాడ ఎంపీ సీటు అయినా లేకపోతే పిఠాపురం ఎమ్మెల్యే సీటు అయినా ఇస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే ముద్రగడ పోటీకి ఇంతదాకా ఎటూ తేల్చలేదు. కానీ ఆయన ఈసారి పోటీ చేస్తారని అంతా అంటున్నారు.

సరైన టైం లో ముద్రగడ తన మనసులో మాట బయటపెట్టాలనుకున్నారు. అయితే పవన్ కాకినాడ సభలో ఇండైరెక్ట్ గా ముద్రగడ మీద చేసిన కామెంట్స్ తో ఆయనలోని ఆవేశం బయటకు వచ్చింది. ఇదే తగిన సమయం అంటూ ఆయన పిఠాపురం అంటూ తన పోటీ సీటూ ప్రకటించేశారు అని అంటున్నారు.

ఇక పిఠాపురంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారు. ఆయన పనితీరు మీద వైసీపీ సర్వేలలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. అందుకే ఆయనకు సీటు నిరాకరిస్తారు అని అంటున్నారు. ఇక ఇదే సీటు మీద కాకినాడ ఎంపీ వంగా గీత కన్ను వేశారు. అయితే ముద్రగడ పోటీకి దిగితే ఆమె కూడా నో చెప్పకపోవచ్చు అని అంటున్నారు.

ఇలా వైసీపీలో పిఠాపురం సీటు ఖాళీ అయిందని తెలిసిన మీదట తన మనసులో కోరికను ముద్రగడ వ్యూహాత్మకంగానే బయట పెట్టారని అంటున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారు అన్నది చాలా కాలంగా జరుగుతూ వస్తున్న ప్రచారం.

పిఠాపురంలో మొత్తం కాపు సామాజికవర్గం ఓటర్లే ఉంటారు. దాంతో ఇక్కడ 2019లో జనసేన తరఫున పోటీ చేసిన శేషుకుమారికి ముప్పయి వేల దాకా ఓట్లు వచ్చాయి. ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ పిఠాపురం అనుకున్నారని అంటున్నారు. ఆయన పిఠాపురం సభలోనే సీఎం అవుతాను అని చెప్పడం జరిగింది. అంతే కాదు పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇచ్చారు.

ఇలా పవన్ ప్రత్యేకమైన ప్రేమను ఈ సీటు మీద చూపిస్తున్నారు. దీంతో ఇపుడు ముద్రగడ కూడా రంగ ప్రవేశం చేసి సీటూ పోటీ అని డిక్లేర్ చేశారు. ఒక విధంగా వైసీపీకి కూడా ముద్రగడ పోటీ చేస్తాను అంటే పవన్ మీద బెస్ట్ చాయిస్ గానే ఉంటుంది. ఈ విషయాలు అన్నీ చూసిన మీదటనే ఆయన ఇలా అన్నారని అంటున్నారు. సో ఇవన్నీ చూసినపుడు బయటకు ఆవేశంగా ముద్రగడ మాట్లాడినట్లుగా అనిపిస్తున్నా ఆయన పోటీ అన్నది వ్యూహాత్మక ప్రకటన అని అంటున్నారు.

వైసీపీ నుంచి పోటీ అని మామూలుగా చెబితే అది పెద్దగా కిక్కు ఇవ్వదు. ఇపుడు పవన్ తనను విమర్శిస్తున్నారని కాపులకు ఎవరెంత చేశారో చూసుకుందామని ముద్రగడ సవాల్ చేస్తూ బరిలోకి దిగడం వల్ల కాపులల్లో చీలిక కచ్చితంగా వస్తుంది. అదే వైసీపీకి ముద్రగడకు కావాల్సింది అని అంటున్నారు.