Begin typing your search above and press return to search.

బాబు ఉలిక్కిప‌డే స‌వాలు విసురుతున్న ముద్ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   4 Sep 2017 8:24 AM GMT
బాబు ఉలిక్కిప‌డే స‌వాలు విసురుతున్న ముద్ర‌గ‌డ‌
X
కొంత‌మందికి కొన్ని స‌వాళ్లు అంటే ఎంత‌మాత్రం ఇష్టం ఉండ‌దు. అలాంటి మాట‌ల్లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం.. ఉప ఎన్నిక‌ల‌ను ఫేస్ చేయ‌టం ఏపీ అధికార‌ప‌క్షానికి అస్స‌లు ఇష్టం ఉండ‌దు. నంద్యాల ఉప ఎన్నిక‌ను త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఫేస్ చేయ‌ట‌మే కాదు.. త‌న స‌మ‌స్త శ‌క్తియుక్తుల్ని ధార పోసి.. దాదాపు రూ.200 కోట్ల ఖ‌ర్చుతో నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకున్నార‌న్న ఆరోప‌ణ ఉంది.

త‌మ పాల‌న‌కు ప్ర‌జ‌ల స్పంద‌న‌గా నంద్యాల గెలుపును త‌న ఖాతాలోకి మ‌ళ్లించుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విప‌క్ష నేత విసిరిన జంపింగ్స్ స‌వాల్‌ కు స్పందించ‌లేదు. త‌మ పార్టీ గుర్తుపై గెలిచి.. జంప్ అయి అధికార‌ప‌క్షం పంచ‌న చేరిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ద‌మ్ము ఉందా? అని జ‌గ‌న్ ఓపెన్ గానే స‌వాలు విసురుతున్నారు.

దీనిపై బాబు రియాక్ట్ కాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. ప్ర‌జ‌లంతా త‌మ వెన‌కే ఉంటార‌న్న మాట‌ను ముఖ్య‌మంత్రి ప‌దే ప‌దే చెబుతున్నారు. బాబు మాట‌ల‌ను ప్ర‌స్తావిస్తూ కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా హామీ ఎలాంటిదో.. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశం కూడా అదే త‌ర‌హా వాగ్దానంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 40 ఉప ఎన్నిక‌లు జ‌రిగితే అందులో ఒక్క ఎన్నికలోనూ టీడీపీ గెల‌వ‌లేద‌ని.. చాలాచోట్ల డిపాజిట్లు కూడా రాలేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

అన్ని ఎన్నిక‌ల్లో ఓడినంత మాత్రానా టీడీపీని మూసేశారా? అని ప్ర‌శ్నించిన ముద్ర‌గ‌డ.. నంద్యాల ఎన్నిక‌లో టీడీపీ అక్ర‌మ ప‌ద్ద‌తిలో గెలిచింద‌న్నారు. వాతావ‌ర‌ణం త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని అధికార‌ప‌క్ష నేత‌లు భావిస్తే.. టీడీపీలో ఉన్న కాపు మంత్రులు.. నేత‌లు వెంట‌నే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్నారు.

2050 వ‌ర‌కు చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడే ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నార‌న్నారు. త‌మ ఉద్య‌మాన్ని మూసేయాల‌ని సీఎం చెప్పిస్తున్నార‌ని.. ఉద్య‌మ కాలంలో వ్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తే ముద్ర‌గ‌డ‌ను కొనేశామ‌న్న విష ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. ఇలాంటి ప్ర‌చారాల్ని ఖండిస్తున్నామ‌ని.. త‌మ జాతి అమ్ముడుబోయే జాతా? అంటూ నిల‌దీశారు. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అధికార‌ప‌క్షం గెలిచిన నేప‌థ్యంలో కాపులు సైతం టీడీపీ ప‌క్షాన ఉన్న‌ట్లుగా చెప్పుకుంటున్న తెలుగు త‌మ్ముళ్లు ముద్ర‌గ‌డ చెబుతున్న‌ట్లుగా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఉప ఎన్నిక‌కు వెళ్ల‌టం లేదంటే ముంద‌స్తుకు వెళ్లమంటూ స‌వాలు విసురుతున్న వైనం బాబుకు ఓ ప‌ట్టాన రుచించ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.