Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా బాబు?

By:  Tupaki Desk   |   29 Jan 2019 6:35 AM GMT
ముద్ర‌గ‌డ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా బాబు?
X
ప‌దునైన వాద‌న‌ను వినిపిస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చ‌మ‌ట‌లు ప‌ట్టించే కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రో లేఖాస్త్రాన్ని సంధించారు. త‌న‌కున్న సందేహాల్ని.. ప్ర‌భుత్వంపై త‌న‌కున్న ఆగ్ర‌హాన్ని లేఖ‌ల రూపంలో విడుద‌ల చేసే అల‌వాటున్న ముద్ర‌గ‌డ తాజాగా మ‌రో లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును లేఖ మొద‌ట్నించి.. చివ‌రి దాకా త‌ప్పు ప‌ట్టిన ఆయ‌న లేఖ‌లోని అంశాలు ఆయ‌న మాట‌ల్లోనే చెబితే..

+ జ‌న‌వ‌రి 31న మా జాతి 13 జిల్లాల పెద్ద‌ల‌తో క‌లిసి గ‌డిచిన మూడేళ్లుగా సాగిన ఉద్య‌మం గురించి మాట్లాడుకోవ‌టానికి క‌త్తిపూడిలో ఒక చిన్న స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ క‌ల‌యిక గురించి మీరు ఉలిక్కిప‌డి.. కంగారు ఎందుకు ప‌డుతున్నారో అర్థం కావ‌ట్లేదు.

+ అన్ని పార్టీల పెద్ద నాయ‌కులు నిత్యం రోడ్డుకు అడ్డంగా ఎన్నో స‌భ‌లు పెట్టుకుంటున్నారు. మీరు కూడా ధ‌ర్మ పోరాట దీక్ష‌ల వంక‌తో విజ‌య‌వాడ లాంటిపెద్ద ప‌ట్ట‌ణంలో.. నాలుగు రోడ్ల జంక్ష‌న్లో ట్రాఫిక్ ను మ‌ళ్లించి మ‌రీ రోడ్డుకు అడ్డంగా కుర్చీలు వేసి ఉపన్యాసాలు చెబుతున్న‌ట్లే.. మేం స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం.

+ మీరు త్వ‌ర‌లో ఢిల్లీలో కూడా దీక్ష చేస్తాన‌ని చెప్పారు. మ‌రి మీకో న్యాయం ? మాకో న్యాయ‌మా? మీకో రాజ్యాంగం? మాకో రాజ్యాంగ‌మా?

+ మా జాతినిద్వితీయ శ్రేణి పౌరులుగా ఎందుకు ప‌రిగ‌ణిస్తున్నారో సెల‌విస్తారా? మ‌ఆ జాతి పాకిస్తాన్.. బంగ్లాదేశ్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన వాళ్లం కాదే? మా మీద ఎందుకింత వివ‌క్ష‌? మేం రోడ్డు మీద రావ‌టానికి కార‌ణం మీరు కాదా?

+ తొమ్మిదేళ్లు ప‌వ‌ర్ లేక ఎండిపోయిన నోరు త‌డుపుకోవ‌టానికి మా జాతి స‌హ‌కారం కావాల్సి వ‌చ్చింది. ఈ రోజు నోర్లు పూర్తిగా త‌డిచిపోయి ఎక్కువ అయిన ఊట‌ను సొల్లుగా కార్చుతూ ఇచ్చే ఉప‌న్యాసాలు న‌మ్మేసి మీకు పాలాభిషేకాలు చేయాలా?

+ ఇప్ప‌టికే ఎన్నోకేసులు పెట్టించారు. లాఠీల‌తో కొట్టించారు. బూతులు తిట్టించారు. చేయాల్సిన అన్ని అవ‌మానాలు చేశారు. ఇక‌.. మిగిలింది తుపాకీతో కాల్చ‌టం మాత్ర‌మే. ఎప్ప‌టికైనా మా శ‌రీరాలు మ‌ట్టిలోక‌ల‌వాల్సిందే. ఆ ప‌ని కూడా పూర్తి చేయించండి.

+ మా జాతికి కుల‌పిచ్చి ఎక్కువైంద‌ని త‌ర‌చూ అంటున్నారు క‌దా? మీరు ద‌ళిత‌నాడు.. గిరిజ‌న నాడు.. బీసీ నాడు.. కాపునాడు అని కులాల వారీగా మీ అధికార‌దాహం కోసం రోడ్డుకు అడ్డంగా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. అన్ని కులాల‌తో స‌మావేశాలు పెడుతున్నారు. మీ సామాజిక వ‌ర్గంతో క‌మ్మ‌టి స‌భ‌ను కూడా ఎందుకు పెట్టుకోవ‌టం లేదు?

+ జ‌న‌వ‌రి 31న మా జాతి నాయ‌కుల‌తో క‌లిసి క‌త్తిపూడిలో స‌మావేశం పెట్టాల‌నుకున్ఆనం. కానీ.. మీరు అసెంబ్లీలో చ‌ట్టం చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు క‌దా? ఈ క్ర‌మంలో సీఎం గారి న‌డ‌క‌ను చూసే వ‌ర‌కు స‌మావేశాన్ని వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. మీ న‌డ‌క‌కు అనుగుణంగా మా ప‌య‌నం ఉంటుంది.