Begin typing your search above and press return to search.

175కి పోటీ చేస్తేనే సీఎం అని చెప్పు... పవన్ కి ముద్రగడ కౌంటర్

By:  Tupaki Desk   |   20 Jun 2023 1:02 PM GMT
175కి పోటీ చేస్తేనే సీఎం అని చెప్పు... పవన్ కి  ముద్రగడ కౌంటర్
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఎవరి నుంచి సరైన కౌంటర్ పడా లో వారి నుంచి పడింది. కాపుల కోసం మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఏమీ కానట్లుగా పక్కన పెడుతూ కాపుల నేత గా తనే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇస్తున్న బిల్డప్పుల కు అదిరిపోయే రేంజి లో ముద్రగడ కౌంటర్ ఇచ్చారు. నా కంటే మీరు పెద్ద నాయకులు కదా నేను ఆపేసిన కాపుల ఉద్యమాన్ని కొనసాగించండి అంటూ ముద్రగడ చేసిన సవాల్ కూడా పవన్ కి ఉక్కిరి బిక్కిరి చేసేదే.

గత కొన్ని రోజులుగా తనను సీఎం ని చేయాలంటూ పవన్ ఇస్తున్న ప్రసంగాల మీద ముద్రగడ గట్టి ఝలక్ ఇచ్చారు మీరు మొత్తం 175 సీట్లకు సొంతంగా పోటీ చేసినపుడు మాత్రమే నన్ను సీఎం ని చేయండి అని అడిగే అవకాశం ఉంటుంది. మాటి మాటికీ టీడీపీ బీజేపీ తో పొత్తు అంటూ చెబుతూ వస్తున్న మీరు నన్ను సీఎం ని చేయండి అని ఎలా అడుగుతారు అంటూ లాజిక్ పాయింట్ తో గాలి నిండా తీసేశారు.

ఒక విధంగా కాపుల ను మభ్యపెట్టే విధంగా పవన్ నన్నే సీఎం చేయండి అంటున్నారన్న విషయాన్ని బట్టబయలు చేయడంలో ముద్రగడ అలా సక్సెస్ అయ్యారన్న మాట. కాపుల ను తాను ఎపుడూ వాడుకోలేదని, యువత ను రెచ్చగొట్టలేదని ముద్రగడ పవన్ కి గట్టి జవాబు చెప్పారు. ఇక రాజకీయ పార్టీ పెట్టాక ఏమిటీ రౌడీ భాష అంటూ పవన్ కి పెద్ద క్లాసే తీసుకున్నారు.

తొక్క తీస్తా తోలు తీస్తా నార తీస్తా గుండు కొట్టిస్తా గుడ్డలూడదీస్తా ఇలా వీధి రౌడీ భాష ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అసలు మీకు రాజకీయ సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ ఇలాంటి భాష వాడకూడదని తెలియదా అని నిలదీశారు. రాజకీయ పార్టీ అధినేత గా పది మంది చేత మెప్పు పొందేలా మన వ్యవహార శైలి ఉండాలని హితవు పలికారు.

అసలు ఇంతకీ ఎంత మందికి మీరు తాట తీశారో చెబుతారా అని కూడా ముద్రగడ ప్రశ్నించారు. ప్రత్యేకించి ఒక ఎమ్మెల్యేను పట్టుకుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడవచ్చునా అని ప్రశ్నించారు. దాని వల్ల మీ సమయం వేస్ట్ కావడం లేదా అని కూడా సూటి గానే అడిగేశారు. మీరు కాపుల ను పెద్దన్న పాత్ర పోషించమని తరచూ ఉపన్యాసాల ద్వారా అడుగుతున్నారు. కాపుల తరఫున నేను ఉద్యమాలు చేసినపుడు మీరు నాకు మద్దతు గా ఎందుకు నిలవలేదు అని అడగను కానీ ఇపుడు మీరు ఈ రకంగా కాపుల ను పెద్దన్న పాత్ర అనడమే విడ్డూరంగా ఉందని సెటైర్లు వేసారు.

విషయాలు తెలుసుకోకుండా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారని, మీరు అన్నట్లుగా ఆయన దుర్మార్గుడు అయితే ప్రజలు రెండు సార్లు ఎందుకు గెలిపిస్తారో ఆలోచించారా అని కూడా ముద్రగడ నిలదీశారు. వారి తండ్రి భాస్కర రెడ్డి, తాత క్రిష్ణారెడ్డి కాపుల కోసం వారి ఉద్యమాల కోసం ఎంతో సహాయం చేసిన చరిత్ర మీకు తెలియకపోవచ్చు అని అన్నారు.

ఒకవేళ చంద్రశేఖర్ రెడ్డి దుర్మార్గం చేస్తూంటే మీరే అక్కడ పోటీ చేసి ప్రజాస్వామ్యపద్ధతి లో ఓడించండి అని ముద్రగడ సలహా ఇచ్చారు. అంతే కాని వీధి రౌడీ స్థాయి లో ఈ భాష ఏంటి అని మండిపడ్డారు రాజకీయాల్లోకి వచ్చాక ప్రతీ ఇంటికి వెళ్లి ఓట్ల కోసం అడుక్కోవాలి. దానికి భేషజాలు పనికి రాదు అని ముద్రగడ హితవు చెప్పారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు, అది గుర్తు పెట్టుకోండి అని సూచించారు. తాను కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయాయనంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారం మీద మండిపడ్డారు. తాను ఏ పెద్దల నుంచి సూట్ కేసులు తీసుకోలేదని, అలాంటి పనులు తాను ఎపుడూ చేయనని ముద్రగడ చెప్పుకున్నారు.

ఒక రాజకీయ నాయకుడిగా పార్టీ అధినేతా మీరు మాట్లాడిన విషయాలు రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయని కూడా పవన్ కి తెలియచెప్పారు. ప్రత్యేక హోదా గురించి. రైల్వే జోన్ గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద మీరు మాట్లాడండి, ఇవి ప్రజల కు ఉన్న సమస్యలు. అంతే తప్ప వీధ్ రౌడీ భాష దయచేసి వాడొద్దని, అది రాజకీయంగా చేటు తెస్తుందని గుర్తు పెట్టుకోవాలని పవన్ కి క్లాస్ అయితే తీసుకున్నారు ముద్రగడ. మరి దీనికి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.