Begin typing your search above and press return to search.

అభిమానికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన ధోనీ

By:  Tupaki Desk   |   3 Nov 2019 9:58 AM IST
అభిమానికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన ధోనీ
X
సినీ.. క్రీడా ప్రముఖులకు అభిమానుల కొదవ ఉండదు. తాము అభిమానించే వారి కోసం అభిమానులు కొన్నిసార్లు ప్రదర్శించే సాహసాలు అన్ని ఇన్ని అన్నట్లుగా ఉండవు. కొందరు ప్రముఖులు అభిమానుల విషయంలో వారి మనసులు గాయపడేలా వ్యవహరిస్తే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి వారి మనసుల్ని దోచేస్తుంటారు. టీమిండియా ప్రముఖ క్రికెటర్.. మిస్టర్ కూల్ ధోనీ తాజాగా తన అభిమానికి ఊహించని రీతిలో సర్ ప్రైజ్ ఇచ్చారు.

జార్ఖండ్ కు చెందిన ధోనీ ఫ్యాన్ ఒకరు కొత్త రాయల్ ఎల్ ఫీల్డ్ కొన్నారు. ఆ బైక్ కొన్నాక నేరుగా రాంచీలోని స్టేడియంకు వచ్చాడు. అదే సమయంలో ధోనీ తన ప్రాక్టీస్ ముగించుకొని బయటకు వస్తున్నాడు. తన అభిమాన క్రీడాకారుడ్ని చూసిన ఆయన అంతులేని ఆనందంతో సెక్యురిటీని దాటుకొని ధోనీ వద్దకు చేరుకున్నాడు.

తానెంతో వీర అభిమానినో చెప్పిన సదరు అభిమాని.. తాను కొత్త బైక్ కొన్నానని.. ఆటోగ్రాఫ్ కావాలని కోరాడు. బైకుల్ని విపరీతంగా ఇష్టపడే ధోని అభిమాని మర్చిపోలేని కానుక ఇచ్చారు. అతగాడి కొత్త బైక్ వద్దకు వచ్చిన ధోనీ.. అతడు తెచ్చిన రాయల్ ఎన్ ఫీల్డ్ చూసి ముచ్చటపడ్డాడు.

ఇష్టపడి కొన్న బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ మీద ఆటోగ్రాఫ్ చేసేసి.. ఆ అభిమానికి అంతులేని ఆనందాన్ని కలిగించాడు. ధోనీని కలిసి.. ఆటోగ్రాఫ్ తీసుకుంటే చాలనుకున్న సదరు అభిమాని.. నేరుగా ధోనీనే బైక్ వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వటాన్ని నమ్మలేకున్నాడు. మొత్తానికి తన అభిమానికి అంతులేని ఆనందాన్ని కలిగేలా ధోనీ వ్యవహరించారని చెప్పక తప్పదు.