Begin typing your search above and press return to search.

రైతుగా మారి ధోని ఏం చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   27 Feb 2020 10:34 AM GMT
రైతుగా మారి ధోని ఏం చేశాడో తెలుసా?
X
మహేంద్ర సింగ్ ధోని.. భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించిన గొప్ప క్రికెటర్ గా చరిత్రలో నిలిచిపోయారు. భారత క్రికెట్ లో మరుపురాని పేరును సొంతం చేసుకున్నారు. అయితే గత ప్రపంచకప్ లో వైఫల్యం తో ధోని మళ్లీ బ్యాట్ పట్టడం లేదు. మునుపటి మెరుపులు లేక పోవడంతో క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు.

ఇక బీసీసీఐ కూడా ధోనిని పట్టించుకోవడం లేదు. టీంకు ఎంపికచేయడం లేదు. దీంతో ధోని తనకిష్టమైన వ్యాపకాలపై దృష్టిసారించారు. మొన్నటి వరకూ బార్డర్ లో మేజర్ లాగా కాపాలా కాశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో బ్యాట్ కూడా పట్టడం లేదు. అయితే తాజాగా కొత్త అవతారంలోకి మారాడు.

క్రికెట్ బ్యాట్ పట్టకుండా.. మైదానంలో దిగకుండా ఇంట్లోనే ఉంటున్న ధోని తాజాగా తన వ్యవసాయ క్షేత్రం లో రైతుగా మారాడు. వ్యవసాయం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

తాజాగా ధోని తన పొలం లో బొప్పాయి, పుచ్చకాయ పంటలను పండించేందుకు సిద్ధం అవుతున్నాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతి లో పంటల సాగుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు.

తాజాగా వ్యవసాయం మొదలుపెట్టిన ధోని విత్తనాలు వేస్తున్న వీడియోను తన ఫేస్ బుక్ ఖాతో షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. ధోని క్రికెట్ కు దూరమై ఇలా సాదాసీదాగా వ్యవసాయం చేయడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకో లేకపోతున్నా.. అందరూ వెళుతున్నట్టు రాజకీయాల్లోకి వెళ్లకుండా ఖాళీగా ఉండకుండా ధోని ఇలా తన పనులు చేసుకోవడం మాత్రం కొంత వరకూ సంతోషపరిస్తుందనే చెప్పాలి.