Begin typing your search above and press return to search.

ధోని ఆస్తులెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..

By:  Tupaki Desk   |   16 Aug 2020 11:30 AM GMT
ధోని ఆస్తులెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే..
X
భారత జట్టులో చోటు సంపాదిస్తే చాలు ఇక ఆదాయమే ఆదాయం. అలాంటిది ధోని జట్టులో చోటు సంపాదించడమే కాదు ఏకంగా దిగ్గజ క్రికెటర్ గా అవతరించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధోని రంజీ క్రికెట్ ఆడే సమయంలో టికెట్ కలెక్టర్ గా పని చేశాడు. ప్రస్తుతం వందల కోట్లకు పడగలెత్తాడు. ఇదంతా క్రికెట్ లోకి వచ్చిన తర్వాత ధోనీ సంపాదించినదే. మ్యాచ్ ల ఫీజులు, యాడ్స్ ద్వారా ధోని రూ.వందల కోట్లు సంపాదించాడు. అతడి ఆస్తి విలువ సుమారు రూ.760కోట్ల నుంచి రూ.830కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సొంత ఊరు రాంచీలో ధోనికి విలాసవంతమైన ఇల్లు, కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. బైకులు అంటే ధోనికి చాలా ఇష్టం.. కొత్త మోడల్ ఏది వచ్చినా సరే కొంటూ ఉంటాడు. అతడి లగ్జరీ కార్ల విలువే సుమారు రూ. 13 కోట్లు. దేశంలో ఇప్పుడు క్రికెట్ ఒక్కటే కాదు.. టెన్నిస్, కబడ్డీ వంటి ఆటలను కూడా ఐపీఎల్ లా నిర్వహిస్తున్నారు. హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ జట్లకు ధోని యజమానిగా ఉన్నాడు. ధోని తన సంపాదనలో అధిక భాగం మ్యాచ్లు ఆడడం ద్వారా, యాడ్ చేయడం ద్వారానే సంపాదించాడు. T 20 లే కాదు.. ప్రస్తుతం వన్డే, టెస్ట్ మ్యాచ్ లు ఆడితే లక్షల్లో ఫీజు ఇస్తున్నారు.

అలాగే బిసిసిఐ కాంటాక్ట్ ద్వారా ధోని ఏటా రూ. 10 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు. ఇక లెక్కలేనన్ని బ్రాండ్లకు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ధోని కి అధిక ఆదాయం యాడ్స్ ద్వారావస్తోంది. ఇక ఐపీఎల్ లో కూడా ధోని విజయవంతమైన కెప్టెన్, మూడు సార్లు టైటిల్ గెలవడం ద్వారా బాగానే సంపాదించాడు. అలాగే ఐపీఎల్ లో వార్షిక వేతనం కూడా ఏడాదికి రూ. 15కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు.సగటున ధోని ఏడాదికి రూ. 100 కోట్లకు పైగా సంపాదిస్తాడని, అతడి ఆస్తుల విలువ మొత్తం రూ 830 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.