Begin typing your search above and press return to search.
నవీన్ రెడ్డి అరెస్ట్.. వైశాలి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్
By: Tupaki Desk | 10 Dec 2022 11:30 AM GMTరంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఒక ఇంటిపై దాడి చేసి ఒక యువతిని కిడ్నాప్ చేసిన వైనం సంచలనమైంది. సినీ ఫక్కీలో రెక్కీ చేసి ఏకంగా 100 మందితో వచ్చి వైశాలి అనే యువతిని పట్టపగలు మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి ఎత్తుకుపోవడం చర్చనీయాంశమైంది. యువతి ఇంటి వద్దనున్న కార్లను ధ్వంసం చేసి.. అడ్డొచ్చిన యువతీ తల్లిదండ్రులు, బంధువులను కర్రలతో కొట్టి.. డెంటల్ డాక్టర్ అయిన వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. సినిమా రేంజ్ లో ఈ హంగామా సాగింది.
ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు కేవలం 6 గంటల్లోనే యువతి ఆచూకీ కనిపెట్టి ఆమెను సేవ్ చేశారు. తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక కిడ్నాప్ నకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పారిపోయాడు. తాజాగా అతడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు.
కాగా నిన్న దాడికి పాల్పడ్డ వారిలో ఎక్కువమంది అతడి టీ షాప్ లో పనిచేసేవారు కాగా.. మరికొందరు అతడి స్నేహితులుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ 31మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా నవీన్ రెడ్డిని విచారించిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2021 ఆగస్టు 4న బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో వైశాలితో తనకు వివాహం జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే బీడీఎస్ పూర్తయ్యేవరకూ ఫొటోలు బయటకు రానీయవద్దని అన్నారని.. ఆమె కండీషన్ మేరకే నేను పెళ్లి ఫొటోలు బయటపెట్టలేదని నవీన్ చెప్పుకొచ్చాడు.
వైశాలి బీడీఎస్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు మాట ఇచ్చారని. పెళ్లి పేరుతో నాతో డబ్బులు కూడా ఖర్చు పెట్టించారని నవీన్ పోలీసులకు తెలిపాడు. నా డబ్బుతో వారు గోవా, అరకు, మంగళూరు సహా పలు ప్రాంతాలకు వెళ్లారని.. ఖరీదైన వోల్వోకారు, రెండు కాఫీ షాపులను వైశాలి తండ్రి పేరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు నవీన్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చాడని సమాచారం.
అయితే నవీన్ కు, వైశాలికి ఎటువంటి సంబంధం లేదని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా ఇంటి సమీపంలో టీషాప్ పెట్టి వైశాలి బయటకు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పెట్టేవాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరి ఈ ఇద్దరి వాదనల్లో నిజం ఎంత? నవీన్ రెడ్డి చెప్పింది నిజమా? లేక వైశాలి కుటుంబ సభ్యులు చెప్పింది నిజమా? అన్నది తేలాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.