Begin typing your search above and press return to search.

క‌రోనాతో పోరులో ఓడిపోయిన‌.. ‘మిస్టర్ ఇండియా’!

By:  Tupaki Desk   |   1 May 2021 2:30 PM GMT
క‌రోనాతో పోరులో ఓడిపోయిన‌.. ‘మిస్టర్ ఇండియా’!
X
ప్రఖ్యాత బాడీబిల్డర్, ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ విజేత జగదీష్ లాడ్ సైతం కరోనా పోరులో ఓడిపోయారు. నవీ ముంబైకి చెందిన జగదీష్ వయసు కేవలం 34 సంవత్సరాలు. ప్రస్తుతం బరోడాలో ఉంటున్న జగదీష్.. కొన్ని రోజులుగా కొవిడ్ తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు.

బాడీ బిల్డర్ జగదీష్ ఎన్నో పోటీల్లో అద‌ర‌గొట్టాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించాడు. ‘మిస్టర్ ఇండియా’ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించిన జగదీష్.. ఎన్నో పతకాలు సాధించాడు.

అయితే.. కొంత కాలంగా ముంబైని వదిలి బరోడాలో ఉంటున్నాడు. బ‌రోడాలోని ఓ జిమ్ లో ట్రైన‌ర్ గా చేరాడు. కానీ.. లాక్డౌన్ సమయంలో జిమ్ సెంట‌ర్ మూత‌ప‌డ‌డంతో తీవ్ర‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కొవిడ్ బారిన ప‌డ‌డంతో.. స‌రైన చికిత్స తీసుకోలేక‌పోయాడు. ఫ‌లితంగా.. ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొని గెలిచిన జ‌గ‌దీష్‌.. క‌రోనా ముందు ఓడిపోవ‌డం విషాదం.

విషాదం ఏమంటే.. బరోడాలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న జ‌గ‌దీష్‌.. అద్దె డ‌బ్బులు కూడా చెల్లించ‌లేని స్థితిలో ఉన్నాడ‌ని స‌మాచారం. ఇందులోనే ఆందోళ‌న క‌లిగించే విష‌యం ఏమంటే.. అత‌ని భార్య కూడా క‌రోనాతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. జగదీష్‌కు భార్యతోపాటు కుమార్తె ఉన్నారు.