Begin typing your search above and press return to search.

అందుకు సిగ్గుపడను: మిస్టర్‌ కూల్‌ హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

By:  Tupaki Desk   |   22 April 2023 2:35 PM GMT
అందుకు సిగ్గుపడను: మిస్టర్‌ కూల్‌ హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!
X
ప్రస్తుతం ఐపీఎల్‌ మంచి ప్రజాదరణతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రాంతాలకతీతంగా ఎక్కువ మంది ఫేవరెట్‌ టీమ్‌ ఏదంటే అందరూ చెప్పే మాట.. చెన్నై సూపర్‌ కింగ్స్‌. మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు కెప్టెన్‌ గా ఉండటమే ఇందుకు కారణం. అభిమానుల ఆశలకు తగ్గట్టే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఐపీఎల్‌ లో రాణిస్తోంది. ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

తాజాగా చెన్నైలోని చెపాక్‌ వేదికగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మిస్టర్‌ కూల్, జార్ఖండ్‌ డైనమేట్‌ ఎంఎస్‌ ధోని చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

తన క్రికెట్‌ కెరీర్‌ ముగింపు దశకు చేరుకుందని ధోని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే తనకు వయసు అయిపోతోందనే వ్యాఖ్యలకు సిగ్గపడబోనన్నాడు. వయసు పెరుగుతుందంటే మరింత అనుభవం వచ్చి చేరినట్లేనని ఈ మిస్టర్‌ కూల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాను ఎప్పుడూ వయసు పెరిగిపోతుందని చెప్పడానికి అస్సలు సిగ్గుపడబోనని వెల్లడించాడు. సచిన్‌ తెందూల్కర్‌ 17 ఏళ్ల నుంచే క్రికెట్‌ ఆడటం ప్రారంభించాడని ధోని గుర్తు చేశాడు. ఈ క్రమంలో ఏకంగా పాతికేళ్లపాటు క్రికెట్‌ కు సచిన్‌ సేవలు అందించాడని వెల్లడించాడు.

ఇప్పటికే చాలామంది తన కెరీర్‌ గురించి మాట్లాడుతున్నారని ధోని గుర్తు చేశాడు. తాను ఎంతకాలం ఆడినా సరే.. ఇప్పుడు కెరీర్‌ చివరి దశలో ఉన్నానని వెల్లడించాడు. ఇప్పుడు దానిని ఎంజాయ్‌ చేస్తున్నానని తెలిపాడు.

కోవిడ్‌ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత అభిమానుల మధ్య ఐపీఎల్‌ ఆడటం ఆనందంగా ఉందన్నాడు. ప్రతి మ్యాచ్‌ లోనూ తమకు మంచి మద్దతును అందిస్తున్న అభిమానులకు «మిస్టర్‌ కూల్‌ కృతజ్ఞతలు తెలిపాడు. కోవిడ్‌ అనంతరం రెండేళ్ల తర్వాత మ్యాచ్‌ లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అభిమానులకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. వారి ఆశలకు తగ్గట్టే చెన్నై విజయాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.


తమ ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారని ధోని ప్రశంసించాడు. ముఖ్యంగా సన్‌ రైజర్స్‌ తో మ్యాచ్‌ లో యువ బౌలర్‌ పతిరాన సూపర్‌ స్పెల్‌ వేశాడని అభినందించాడు. అలాగే స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారని మెచ్చుకున్నాడు.

ఈ నేపథ్యంలో మిస్టర్‌ కూల్‌ తన వయసు, కెరీర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఇదే ధోనికి చివరి ఐపీఎల్‌ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ ధోని అభిమానులు మాత్రం ఇంకా క్రికెట్‌ ఆడాలని.. తమను రంజింపచేయాలని కోరుకుంటున్నారు.