Begin typing your search above and press return to search.

మోహన్ బాబు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటున్న ఎంపీటీసీ!

By:  Tupaki Desk   |   18 Jun 2023 4:41 PM GMT
మోహన్ బాబు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటున్న ఎంపీటీసీ!
X
ప్రస్తుతం చిత్తూరు జిల్లా రంగంపేటలో మోహన్ బాబు అనుచరులు వర్సెస్ స్థానిక ఎంపీటీసీ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే ఈ వ్యవహారం విద్యానికేతన్ సంస్థల డంపింగ్ యార్డ్ స్థలం కోసం జరుగుతున్న వ్యవహారంగా తెలుస్తుంది. ఈ స్థలాన్ని మోహన్ బాబు అడగడం.. అందుకు గ్రామస్థులు ఒప్పుకోకపోవడం దీనికి కారణంగా తెలుస్తుంది.

అవును... ప్రస్తుతం చిత్తూరు జిల్లా రంగంపేటలో ఒక భూ వ్యవహారం రచ్చగా మారిందని తెలుస్తుంది. ఈ సందర్భంలో స్థానిక ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ... విద్యానికేతన్ సంస్థల డంపింగ్ యార్డ్ స్థలం కోసం మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని.. అయితే గ్రామ సభలో తీర్మానం చేశాకే ఆ భూములు ఇస్తామని చెప్పామని చెబుతున్నారు. అయితే ఆ గ్రామసభలో... ఇవి గ్రామానికి సంబంధించిన భూములు కావడంవల్ల ఆ స్థలం ఇవ్వకూడదని గ్రామస్తులు తీర్మానం చేశారన్నారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా... ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మోనీష్‌ లపై మోహన్ బాబు మనుషులు దాడికి ప్రయత్నం చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి నుంచి రంగంపేటలో ఆరుగురు దుండగులు పెట్రోల్ క్యాన్‌ లు, కత్తులు, కర్రలతో హల్‌ చల్ చేస్తున్నారని గ్రామస్తులు గుర్తించారంట. వారిలో హేమంత్ అనే ఓ యువకుడ్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

ఇదే విషయాలపై మరింత వివరణ ఇస్తున్న బోస్ చంద్రారెడ్డి... నాగపట్నం సర్వే నెంబర్ 10/2లో 35 సెంట్లు భూమిపై మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వాహకులు కన్నేశారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి 2023 ఫిబ్రవరిలో సమాచార హక్కు చట్టం కింద తాము వివరాలు కోరామని.. గుణశేఖర్ రెడ్డి పేరుతో వివరాలు సేకరించామని చెబుతున్నారు. దీంతో అప్పటినుంచి తమపై కక్ష పెంచుకున్నారని ఎంపీటీసీ బోస్ చెబుతున్నారు!

ఇదే సమయంలో తనపై దాడికి యత్నించారని చెబుతున్న బోస్... హేమంత్ అనే ఒక వ్యక్తి మాస్క్ ధరించుకొని తమ ఇంటికొచ్చి కత్తి తీసి బెదిరించాడని చెబుతున్నారు. అయితే.. అపార్ట్‌ మెంట్‌ లో ఉన్న జనాలను చూసి వెనక్కి వెళ్లిపోయాడని, ఆ సమయంలో అతనితో వచ్చిన కొంతమంది కారు దగ్గర కర్రలు పెట్టుకుని ఉన్నారని చెబుతున్నారు!

దీంతో... తమకు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల ప్రాణహాని ఉందని.. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని బోస్ చంద్రారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్థానిక పోలీసులు స్పందించాల్సి ఉంది!