Begin typing your search above and press return to search.

ఎంపీలకు జీతాల దీపావ‌ళి!

By:  Tupaki Desk   |   2 Nov 2016 9:24 AM GMT
ఎంపీలకు జీతాల దీపావ‌ళి!
X
మ‌న ఎంపీల‌కు నిజ‌మైన దీపావ‌ళి వ‌చ్చింది! ఇప్పుడు వారికి ఉన్న వేత‌నాలు - భ‌త్యాల‌ను రెట్టింపు చేస్తూ.. మోడీ ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. దీంతో ఎంపీల వేత‌నాలు నెల‌కు దాదాపు రూ. 2 ల‌క్ష‌లు చేరిపోతున్నాయి. దీనికి అల‌వెన్సులు అద‌నం. వాస్త‌వానికి స్వేదం చిందించే సామాన్య కార్మికుడికి ఓ వెయ్యి రూపాయ‌ల వేత‌నం పెంచాలంటే ఖ‌జానాపై భారం ప‌డిపోతుంద‌ని మొస‌లి క‌న్నీరు కార్చే రాజ‌కీయ నేత‌లు త‌మ జేబులు నింపుకొనేందుకు, త‌మ వేత‌నాలను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెంచుకునేందుకు వెన‌కా ముందూ ఆలోచించ‌డం లేదు.

కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఉన్నా - బీజేపీ సార‌ధ్యంతోని యూపీఏ ఉన్నా ఈ విష‌యంలో ఒక్క‌టే!! ఇప్ప‌టికే ఎంపీల వేత‌నాలు - భ‌త్యాలు భారీ స్థాయిలో ఉంటే.. అవి చాల‌ద‌న్న‌ట్టు మోడీ ప్ర‌భుత్వం వాటిని అమాంతం రెట్టింపు చేసింది. నిజానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ లెక్క‌ల ప్ర‌కారం మ‌న పార్ల‌మెంటులో ఉన్న 90% ఎంపీలు అంద‌రూ కోటీశ్వ‌రులే. అంద‌రూ బ‌హుళ వ్యాపారాల్లో త‌ల‌మున‌క‌లై ఉన్న‌వారే! అయినా.. కూడా వారంతా ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, క‌నీస వేత‌న ప‌రిస్థితి బాగోలేద‌ని పేర్కొంటూ వేత‌నాల‌కు పెంపున‌కు తెర‌దీశారు.

ఈ విష‌యంలో స్వ‌ప‌క్ష‌ - విప‌క్ష ఎంపీలందరూ ఒకే మాట‌పై ఉండ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సి విష‌యం. పార్టీల భేదాలు - అజెండా విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి.. మూకుమ్మ‌డిగా త‌మ‌కు మేలు చేసుకునే క్ర‌తువుకు ఎంపీలు త‌ల‌లూపారు. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య‌నాథ్ నేతృత్వంలో పార్లమెంట్ సభ్యుల వేతన - అలవెన్స్ జాయింట్ కమిటీ చేసిన సిఫార్సుల‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

దీని ప్ర‌కారం మొత్తంగా పార్లమెంట్ సభ్యులు అందుకునే వేతనాలు నెలకు రూ.1,90,000 నుంచి రూ.2,80,000 కు ఎగిశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంపీల వేత‌న రూ.50 వేలుగా ఉండ‌గా, వారికి అల‌వెన్సు రూపంలో నెల‌కు మ‌రో 45 వేలు ముడుతోంది. ఇవికాక‌, ఎంపీ లాడ్స్ పేరుతో నిధులు అందుతున్నాయి. ఇక‌పై ఇవి రెట్టింపు కానున్నాయి. సో.. జీతాల పండ‌గ అంటే ఎంపీల‌దే మ‌రి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/