Begin typing your search above and press return to search.

వైసీపీలో స‌గం మంది ఎంపీలు ఫ‌ట్‌?

By:  Tupaki Desk   |   1 Aug 2022 12:30 AM GMT
వైసీపీలో స‌గం మంది ఎంపీలు ఫ‌ట్‌?
X
వైసీపీలో స‌గం మంది ఎంపీల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని.. గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుతం 22 మంది ఎంపీలువైసీపీకి ఉన్నారు. వీరిలో ఒక‌రు రెబ‌ల్ గా మారిపోయారు. ఆయ‌న‌ను త‌ప్పిస్తే.. 21 మంది ఎంపీలు వైసీపీకి అత్యంత విధేయులుగా ఉన్నారు., అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లోవీరిలో స‌గం మందికి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని.. అంటున్నారు. వీరిలో కొంద‌రు ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన వారు కూడా ఉన్నార‌ని.. వైసీపీ నేత‌లు.. చ‌ర్చించుకుంటున్నారు.

బాప‌ట్ల ఎంపీ.. నందిగం సురేష్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈయ‌న‌ను ఎమ్మెల్యేగా తాడి కొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఎంపీగా మ‌ళ్లీ టికెట్ ఇస్తే.. ఈ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. ముఖ్యంగా వైసీపీలోనే చాలా మంది ఆయ‌నను వ్య‌తిరేకిస్తున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మార్పు ఖ‌చ్చిత‌మ‌నే టాక్ వినిపిస్తోంది.

న‌ర‌సారావు పేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులును ఇప్ప‌టికే అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. ఆయ‌న టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉండడంతోపాటు.. రాజ‌ధాని అమ‌రావతికి అనుకూలంగా ఉన్నార‌ని.. అధిష్టానం న‌మ్ముతోంది. దీంతో ఆయ‌న‌కు ఈ ద‌ఫా పార్టీలో ఛాన్స్ మిస్‌చేయ‌నున్నారు. అదేవిధంగా హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధ‌వ్‌ను త‌ప్పించి.. ఆయ‌న స్థానంలో మ‌రో బీసీ నేత‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ట‌.

అలాగే.. రాజ‌మండ్రి ఎంపీ.. భ‌ర‌త్‌ను త‌ప్పిస్తార‌ని.. ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. వ్య‌క్తిగ‌తంగా మంచి నాయ‌కుడే అయినా.. పార్టీలో ఆయ‌న‌కు స‌ఖ్య‌త లేదు. అదేవిధంగా అర‌కు ఎంపీ.. గొట్టేటి మాధ‌వికి ఈ ద‌ఫా.. ఎమ్మెల్యే సీటు కావాల‌ని.. కోరుతున్నారు. ఆమె పెర‌ఫ్మార్మెన్స్ జీరోగా ఉంద‌ని.. పార్టీ అభిప్రాయ‌ప‌డుతోంది. శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తాన‌ని చెబుతున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ఈ ద‌ఫా ఛాన్స్ ద‌క్కుతుంద‌ని అంటున్నారు.

న‌ర‌సాపురం నుంచి ప్ర‌స్తుతం ఉన్న ర‌ఘుర‌మాకృష్ణ‌రాజు స్థానంలో బీజేపీ నాయ‌కుడు.. మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు కుమారుడుకి టికెట్ ఇవ్వ‌డం దాదాపు ఖాయ‌మైంద‌నే టాక్ వినిపిస్తోంది. విజ‌య‌వాడ ఎంపీ స్థానాన్ని.. మ‌రోసారి పీవీపీ ఆశిస్తున్నారు. అయితే.. వైసీపీ నాయ‌కులు.. ల‌గ‌డ పాటి రాజ‌గోపాల్‌ను ముగ్గులోకి లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న వ‌స్తే.. టికెట్ ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఇక‌, కాకినాడ ఎంపీ.. వంగా గీత‌కు.. ఈ ద‌ఫా టికెట్‌ల‌భించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ఉన్న‌త విద్యావంతురాలైన‌ప్ప‌టికీ.. ఆశించిన విధంగా దూకుడు చూపించ‌లేక పోతున్నార‌ని పార్టీ అధిష్టానం బ‌లంగా న‌మ్ముతోంది. ఇక‌, విజ‌య‌నగ‌రంలోనూ మార్పు త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. ఇక‌, క‌డప ఎంపి అవినాష్ రెడ్డిని రాజంపేట నుంచి రంగంలొకి దింపాల‌ని చూస్తున్నారు. ఇక్క‌డ కూడా వైఎస్ కుటుంబానికి చెందిన మ‌రో కొత్త నేత‌కు ఛాన్స్ ఇవ్వ‌నున్నార‌ని.. పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌సాగుతోంది.