Begin typing your search above and press return to search.

9 రాష్ట్రాల ఎంపీలు..ఎమ్మెల్యేలపై కేసులు 3095.. తెలుగు రాష్ట్రాల మాటేంటి?

By:  Tupaki Desk   |   26 March 2021 5:48 AM GMT
9 రాష్ట్రాల ఎంపీలు..ఎమ్మెల్యేలపై కేసులు 3095.. తెలుగు రాష్ట్రాల మాటేంటి?
X
పేరుకు ప్రజాప్రతినిధులే కానీ.. క్రిమినల్ కేసుల్లో ఉన్న ఎంపీలు.. ఎమ్మెల్యేలు దేశ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారి మీద ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోని ఎంపీలు.. ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల లెక్కను పార్లమెంటులో వెల్లడించారు కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్.

ప్రత్యేక కోర్టుల్లో విచారణ దశల్లో ఉన్న కేసులు మొత్తం 3095. అత్యధికం ఉత్తరప్రదేశ్ లో ఉండగా.. అతి తక్కువగా మహారాష్ట్రలో ఉన్నట్లుగా తేలింది. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రాల వారీగా విచారణలో ఉన్న కేసుల సంఖ్యను చూస్తే..

- తెలంగాణ 219
- ఏపీ 103
- కర్ణాటక 143
తమిళనాడు 74
మహారాష్ట్ర 13
ఢిల్లీ 99
ఉత్తరప్రదేశ్ 2127

ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల్లో యూపీ మొదటి స్థానంలో నిలిస్తే.. తర్వాతి స్థానంలో తెలంగాణ రాష్ట్రమే ఉంది. కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో ఉన్నది ఏపీలోనే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ కంటే తెలంగాణలో క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి? అన్న విషయానికి వస్తే ఆసక్తికర విషయాల్ని చెబుతున్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో భాగంగా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. రైలు రోకో లాంటివే తీసుకుంటే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అదే సమయంలో విభజనకు ముందు.. ఉమ్మడి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో ఏపీ ప్రాంతానికి చెందిన నేతల మీదా కేసులు నమోదయ్యాయి. అవన్నీ తెలంగాణ ఖాతాలో ఇప్పటికి విచారణ జరుగుతున్నాయి. దీంతో.. ఇవన్నీ తెలంగాణ ఖాతాలో పడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నమోదైన కేసులు ఏపీలోకి రావటంతో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం అండర్ లైన్ చేసుకోవాల్సిందే.