Begin typing your search above and press return to search.

ఎంపీ వర్సెస్ మంత్రి.... గోదారి జిల్లాలో కొత్త రచ్చ!

By:  Tupaki Desk   |   26 April 2023 6:00 AM GMT
ఎంపీ వర్సెస్ మంత్రి.... గోదారి జిల్లాలో కొత్త రచ్చ!
X
ఇద్దరూ వైసీపీనే. ఇద్దరూ కీలక బాధ్యతలతో ఉన్నారు. ఒకరు అమలాపురం ఎంపీ చింతా అనూరాధ అయితే మరొకరు మంత్రి పినిపే విశ్వరూప్. ఇద్దరి మధ్యన వివాదాలు ఉన్నాయా విభేదాలు ఉన్నాయా అంటే తెలియదు కానీ నిన్నటికి నిన్న వైసీపీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు తమ మనసు విప్పి మాట్లాడారని టాక్.

అలాగే అమలాపురం ఎంపీ చింతా అనూరాధ కూడా తన మాటను చెప్పారు. సంక్షేమ పధకాలు ఏవీ ఎస్సీలకు పెద్దగా అందడంలేదు అని కూడా హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి ఇది పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సమావేశం. దాంతో ఈ వ్యాఖ్యలు ఆమె అన్నట్లుగా పార్టీ లోపలా బయటా కూడా రాజకీయ దుమారమే చెలరేగింది.

దీంతో సొంత జిల్లాకు చెందిన ఎంపీ హాట్ కామెంట్స్ ని మంత్రి ఖండించి ఆమె అన్నది నిజమే అన్న దాన్ని జనంలోకి మరీ ముఖ్యంగా విపక్షం వారి దగ్గరకు విజయవంతంగా తీసుకెళ్లారా అన్న చర్చ వస్తోంది. ఏపీలో ఎస్సీలకు ఏకంగా 52 వేల కోట్ల రూపాయల పై చిలుకు సంక్షేమ పధకాలు అందుతున్నాయని, వారికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మంత్రి అంటున్నారు.

ఆమె అలా ఎందుకు అన్నారో అని కూడా ఆయన విమర్శించారు. ఒక ఎంపీగా ఆమె అవగాహన లేక మాట్లాడారా లేక మరోటా అన్నది తనకు అర్ధం కావడంలేదు అని ఆయన అనడం విశేషం. ఆమె ఏ ఉద్దేశ్యంతో మాట్లాడినా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను అని విశ్వరూప్ అనడం పట్ల ఇపుడు చర్చ సాగుతోంది.

ఎంపీ అవగాహన లేకుండా మాట్లాడిన మాటలను ప్రతీ ఒక్కరూ ఖండించాలని కూడా ఆయన అనడమూ విశేషంగా చూస్తున్నారు. ఒకే పార్టీలో ఒకే సామాజికవరంలో ఇలా రెండు భావాలు ఉండడం తప్పు అవునో కాదో తెలియదు కానీ ఇలా రచ్చకు దిగడం రాజకీయంగా ప్రత్యర్ధుల మాదిరిగా విమర్శలు మంత్రి చేయడం మీదనే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

మంత్రి విశ్వరూప్ ఎంపీ విషయంలో ఇలా ఓపెన్ అయి మాట్లాడం కూడా వైసీపీలో అంతా ఆలోచించేలా చేస్తోంది. అసలు ఎంపీ మంత్రి గారి మధ్యలో విభేదాలు ఏమి ఉన్నాయి రాజకీయంగా ఆధిపత్యం కోసం ఇద్దరూ చూస్తున్నారా అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫూన్ ఎమ్మెల్యేగా అనూరాధ పోటీ చేస్తారు అన్న వార్తలు కూడా ఇటీవల కాలంలో ప్రచారంలో ఉన్నాయి. మరి దానిని కనుక చూసుకుంటే ఆమె విషయంలో ముందే చెక్ చెప్పేలా మంత్రిగారు ఇపుడు ఆమె చేశారు అని ప్రచారంలో ఉన్న వార్తలను పట్టుకుని విమర్శలకు దిగరా అని అంటున్నారు. ఏది ఏమైనా ఎంపీ వర్సెస్ మంత్రి రచ్చ మాత్రం గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గానే ఉంది మరి.