Begin typing your search above and press return to search.
పింక్ డైమండ్ : ఎంపీ విజయసాయిరెడ్డి, రమణదీక్షితులకు షాక్ !
By: Tupaki Desk | 15 Feb 2021 11:10 AM GMT2019 ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారికి చెందిన పింక్ డైమండ్ పోయిందని, అది అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొట్టేశారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అలాగే అప్పటి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. ఆ సంచలన వ్యాఖ్యలతో వారిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని టీటీడీ పాలక మండలి వీరిద్దరిపై రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేసింది. రూ.2 కోట్లు స్టాంపు ఫీజు చెల్లించాలని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు నమోదైంది.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కేసు ఉపసంహరించుకోవాలంటూ టీటీడీ కోర్టులో విత్ డ్రా పిటిషన్ వేసింది. అయితే కేసును విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేదని తెలంగాణకు చెందిన తెలంగాణ హిందూ జనశక్తి పార్టీతో పాటు, గుంటూరుకు చెందిన ఓ న్యాయవాది కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. దీంతో వారిపై కేసు ఉపసంహరించు కునేందుకు కోర్టు నిరాకరించింది.
టీటీడీ తో పాటు కేసులో మరికొందరు ఇంప్లీడ్ అయ్యేందుకు నేడు కోర్టు అంగీకరించంతో కేసు ఉపసంహరణ కుదరదు. దీంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం కానుంది.
ఇటీవల హైకోర్టు పింక్ డైమండ్ అనేదే లేదని స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ కారణంగా అందరి దృష్టి పరువు నష్టం కేసుపై పడింది. కేసు నడిస్తే.. మెరిట్స్ ప్రకారం, రమణదీక్షితులు, విజయసాయిరెడ్డి ఇద్దరూ ఇబ్బందులు పడటం ఖాయమని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేసును ఎలాగోలా ఉపసంహరించుకోవాలనే పట్టుదలతో వారిద్దరూ ఉన్నారు. కానీ ఇప్పుడు కేసు పరిధి టీటీడీని దాటిపోయినట్లుగా కనిపిస్తోంది.