Begin typing your search above and press return to search.

‘నేను మీ వాడ్ని’.. విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ పై భయం అక్కర్లేదు.. ఎంపీ సురేశ్​ ప్రభు కామెంట్​..!

By:  Tupaki Desk   |   6 Feb 2021 5:10 AM GMT
‘నేను మీ వాడ్ని’.. విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ పై భయం అక్కర్లేదు..  ఎంపీ సురేశ్​ ప్రభు కామెంట్​..!
X
విశాఖ స్టీల్ ఫ్లాంట్​ను ప్రైవేటీకరించడంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో వ్యతిరేకత వస్తున్నది. పార్టీలకతీతంగా ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికయితే వైసీపీ, టీడీపీ ముఖ్యనాయకులు ఈ విషయంపై మాట్లాడలేదు. కానీ కొందరు నేతలు విశాఖ స్టీల్​ ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​నుంచి రాజ్యసభకు ఎన్నికైన సురేశ్​ ప్రభు ఈ విషయంపై మాట్లాడారు.

‘నేను ఆంధ్రపదేశ్​కు కజిన్​ లాంటి వాడిని. ఏపీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించాను. ఇక్కడి సమస్యలపై నాకు అవగాహన ఉంది. విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ను ప్రైవేటీకరించడం సరైన నిర్ణయమే. ఏపీ ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలోనే ఉంటుంది. ఎక్కడికీ వెళ్లదు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక ప్రైవేట్ యాజమాన్యం నడుపుతుంది ’ అని సురేష్ ప్రభు అన్నారు.

కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందని చెప్పారు. అందులో భాగంగానే కేంద్రం ప్రైవేట్​ భాగస్వామ్యాన్ని పెంచుతుందని చెప్పారు. విశాఖ స్టీల్​ ఫ్లాంట్​ కోసం చేసిన త్యాగాలు ఏపీ ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ప్రజల త్యాగాలను బీజేపీ ఎప్పటికీ మరవబోదన్నారు. జూన్​ 2016 లో సురేష్ ప్రభు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనకు టీడీపీ మద్దతు ఇచ్చింది. గతంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.