Begin typing your search above and press return to search.
ఎంపీ సుజనా.. అమెరికాకు వెళ్లటానికి హైకోర్టు పర్మిషన్ అవసరమా?
By: Tupaki Desk | 14 Nov 2020 5:00 AM GMTప్రముఖ వ్యాపారవేత్త.. రాజ్యసభ సభ్యుడు.. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న సుజనా చౌదరి తాజాగా అమెరికాకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పింది. ఇటీవల ఆయన అమెరికాకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లగా.. ఆయన్ను ప్రయాణానికి అధికారులు అనుమతించలేదు. ఆయనపై గతంలో జారీ అయిన లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చేసేదేమీ లేక విమానాశ్రయం నుంచి వెనక్కి తిరిగి వచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం తాను అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందని.. తన ప్రయాణానికి అనుమతిని ఇవ్వాలని పేర్కొంటూ సుజనా కోరారు.
న్యూయార్కులో ఉన్న తన బంధువు అనారోగ్యంతో ఉండటంతో పరామర్శించేందుకు వెళ్లాల్సి వచ్చినట్లుగా తెలంగాణ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం పిటిషన్ ను పరిశీలిస్తూ.. కొన్ని కండీషన్లు విధిస్తూ అమెరికా ప్రయాణానికి ఓకే చెప్పారు. తన ప్రయాణ వివరాలతో పాటు.. ఎప్పుడు తిరిగి వచ్చే వివరాల్ని సంబంధిత అధికారులకు అఫిడవిట్ ఇవ్వాలని సుజనాకు సూచన చేశారు.
ఇంతకూ సుజనా అమెరికా ట్రిప్ ను అధికారులు ఏ కారణంతో అడ్డుకున్నారన్న విషయంలోకి వెళితే.. మెసర్స్ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరో కేసు సుజనాపై ఉంది. ఈ రెండు కేసుల విషయంలో ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ.. ఢిల్లీ హైకోర్టులు పేర్కొన్న విషయాన్ని తాజాగా కోర్టుకు చెప్పారు.
అంతేకాదు.. సుజనా ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై ఉన్న నేరారోపణలపై అధికారుల విచారణకు సహకరిస్తున్నందున ఆయన ప్రయాణానికి కోర్టు ఓకే చెప్పాలని కోరారు. ఈ వాదనలకు ఓకే చెప్పిన తెలంగాణ హైకోర్టు రెండు వారాల పాటు అమెరికా ప్రయాణానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.