Begin typing your search above and press return to search.
సోయం బాబూరావు హౌస్ అరెస్ట్..కేసీఆర్ కు కొత్త తలనొప్పి
By: Tupaki Desk | 10 Sep 2019 5:14 AM GMTఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో తలనొప్పి బీజేపీ ఎంపీ సోయం బాబూరావు పుణ్యమా అని మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు.. లంబాడాల మధ్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఇష్యూలను ఒక కొలిక్కి తెచ్చే విషయంలో కేసీఆర్ సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రెండు వర్గాల మధ్య దూరం అంతకంతకూ పెరిగింది.
తాజాగా సోయం బాబూరావుకు ఆదివాసీలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. ఈ ప్రోగ్రాంను తాము అడ్డుకుంటామని లంబాడాల సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు సదరు కార్యక్రమం అవకాశం ఇస్తుందన్న ముందస్తు ఆలోచనతో హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం జంటనగరాల్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున బలగాల్ని తీసుకొచ్చి సిటీలో ఉంచారని.. ఈ నేపథ్యంలో సోయం బాబూరావుకు తగినంత రక్షణ ఇవ్వలేమన్న పోలీసు శాఖ ఆయన్ను అడ్డుకుంది. ఇదిలా ఉంటే.. ఇదంతా తనను.. ఆదివాసీలను అణగదొక్కేందుకే కేసీఆర్ సర్కారు ఇదంతా చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు.
మంత్రిగా సత్యవతి రాథోడ్ ప్రమాణస్వీకారం చేయగానే.. ప్రభుత్వం ఆదివాసీల అణిచివేత చర్యలకు పాల్పడుతోందని సోయం ఆరోపించారు. ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినంతనే సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేశారన్నారు. సోయం బాబూరావు హౌస్ అరెస్ట్ ను విపక్ష నేతలు తప్ప పడుతున్నారు.
ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయటం ఏ మాత్రం సరికాదన్న వాదనను వినిపిస్తున్నారు. ఎంపీ భద్రత తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని.. అందుకు భిన్నంగా హౌస్ అరెస్ట్ చేయటం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మండిపడుతున్నారు. మొత్తంగా సోయం ఎపిసోడ్ ఇప్పుడు హాట్ హాట్ గా మారిందని చెప్పక తప్పదు.