Begin typing your search above and press return to search.

గ్యాంగ్ రేప్ పై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్స్ ..ఇరకాటంలో సీఎం !

By:  Tupaki Desk   |   28 Aug 2021 8:30 AM GMT
గ్యాంగ్ రేప్ పై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్స్ ..ఇరకాటంలో సీఎం !
X
దేశంలో ఈ మధ్య కాలంలో వరుసగా మహిళలపై , అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం పలు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలని తీసుకొచ్చినప్పటికీ అవేవి కూడా మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇక తాజాగా కర్ణాటక రాష్ట్రం , మైసూర్ లో విద్యార్థిని పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే , ఆ గ్యాంగ్ రేప్ ఘటన పై రాష్ట్ర మంత్రులు , బీజేపీ నేతలు మాట్లాడే మాటలని చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఘటన పై మీ స్పందన ఏంటి అని అడిగితే, ఓ రాజకీయ నాయకుడిగా భాద్యత తో మాట్లాడాల్సింది పోయి , నాకేం సంబంధం , ఆ సమయంలో ఆ అమ్మాయికి అక్కడేం పని , అక్కడికి ఎందుకు వెళ్ళింది, కాలేజ్ కి వెల్లిన అమ్మాయి ఇంటికి వెళ్లకుండా బాయ్ ఫ్రెండ్ తో ఎందుకు వెళ్ళింది అంటూ ఎదురు ప్రశ్నిస్తుండటం తో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే హోమ్ మంత్రి ఈ ఘటన పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ టైమ్ లో ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్లాలి అంటూ కర్ణాటక హోమ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తరువాత విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ అలాగే అసహనంగా మాట్లాడారు. గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో నేను అక్కడ ఏమైనా ఉన్నానా, లేక నేను ఏమైనా చూశానా, ఎందుకు పదేసదే ఆ ప్రశ్న వేసి విసిగిస్తున్నారని బీజేపీ ఎంపీ కొంత అసహనం కి గురైయ్యారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తనకు చాలా పనులు ఉంటాయని బీజేపీ ఎంపీ సిద్దేశ్వర చాలా నిర్లక్షంగా సమాధానం ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. బీజేపీ ఎంపీ సిద్దేశ్వర చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మైసూరు నగరం శివార్లలోని చాముండికొండ మీద జరిగిన కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో కర్ణాటక హోమ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతరాత్రి పూట నిర్జనప్రదేశంలోకి కాలేజ్ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎందుకు వెళ్లాలి, అలా వెళ్లకుండా ఉండాల్సింది, అలాంటి సమయంలో అందరిని ఆపడం మనకు సాధ్యం కాదని హోమ్ మంత్రి కనీస భాద్యత కూడా లేకుండా మాట్లాడారు. అలాగే , తన మీద ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హోమ్ మంత్రి మండిపడ్డారు. మైసూరులో కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే కుళ్లు రాజకీయాలు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద రేప్ చేస్తున్నారని బెంగళూరులో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత, బీజేపీ నాయకులు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటంతో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇరకాటంలో పడుతున్నారు. మైసూరు ఎంబీఏ విద్యార్థిని కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో ఇంకా ఎవ్వరిని అరెస్టు చెయ్యకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.