Begin typing your search above and press return to search.

సీఎం సీటుకే దిక్కులేదు.. మమ్మల్ని ఎవరు అడిగారు? ఎంపీ హాట్ కామెంట్స్..

By:  Tupaki Desk   |   16 March 2023 10:04 AM GMT
సీఎం సీటుకే దిక్కులేదు.. మమ్మల్ని ఎవరు అడిగారు? ఎంపీ హాట్ కామెంట్స్..
X
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారుతాయి. ఒక్కోసారి దేశాన్ని అట్టుడికిస్తాయి. దక్షిణాదిలో ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పవర్ ను చేజిక్కిచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధిష్టానం ఈ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు టికెట్ టికెట్ దక్కించుకోవడానికి ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు నేతలు చేసే కామెంట్లు రాజకీయ చిచ్చును రగిలిస్తున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ సిద్దేశ్వర్ ఏకంగా సీఎం బస్వరాజుపైనే సెటైర్లు వేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీలోనే ఈ చర్చ ఉండడం ఆసక్తిని రేపుతోంది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మార్చి 25న దావణగెరెకు రానున్నారు. ఇందుకోసం జీఎంఐటీకి వదంల ఎకరాల్లో సభా స్థలిని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా లోక్ సభ సభ్యుడు జీఎం సిద్దేశ్వర్ తో పాటు బీజేపీ నేతలు ప్రధాని పర్యటన స్థలాన్ని పరిశీలించారు. బందోబస్తు నేపథ్యంలో జిల్లా ఎస్పీ సీబీ రిష్యంత్ తో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ సిద్దేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ సీటు వచ్చేది అధిష్టానమే చూసుకుంటుందని అన్నారు. సీఎం సీట్లో కూర్చున్న బస్వరాజు బొమ్మైకు కూడా మరోసారి టికెట్ ఇస్తారో.. లేదో.. మాకే తెలియదు అని అన్నారు. షిగావ్ నుంచి గెలిచి బసవరాజు బొమ్మై సీఎం అయ్యారు.

అయితే సిద్దేశ్వర్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపాయి. ఆయనకు టికెట్ రావొద్దనే సిద్దేశ్వర్ కోరుకుంటున్నారా? అని కొందరు ఆయన చేసిన వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు. సొంత పార్టీనేతలను విమర్శించడం ద్వారా పార్టీ పరువు ఏంకాను? అని ప్రశ్నిస్తున్నారు. అయితే సిద్దేశ్వర్ టికెట్ల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందన్న సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

ఇదిలా ఉండగా సిద్దేశ్వర్ మాట్లాడుతూ కొన్ని రోజులుగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. మంత్రి వీ సోమన్న బీజేపీతోనే ఉంటారని చెప్పారు. మా పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి ఎవరూ వెళ్లరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు గెలుచుకుంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. బస్వరాజు సీఎం కావడం ఎంపీ సిద్దేశ్వర్కు ఇష్టం లేనట్టుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.