Begin typing your search above and press return to search.
నోటి దురుసు టీడీపీ ఎంపీ ఇంకో వివాదం
By: Tupaki Desk | 6 Sept 2015 4:07 PM ISTఏపీ టీడీపీ ఎంపీలు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కుతున్నారు. రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యల సంగతి పక్కనపెడితే దేశానికి సంబంధించిన అంశాలపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు. తాజాగా ఆయన ఇస్రోను టార్గెట్ చేశారు. ఇస్రో రాకెట్ ప్రయోగం చేయడానికి ముందు తిరుపతిలో కొబ్బరికాయ కొట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. దేవుడు ముఖ్యమా... రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అంటూ ప్రశ్నించారు.
భారతదేశంలో పండగలు ఉండడం దురద్రుష్టకరమని కూడా అన్నారు. వినాయకచవితితో నీటి కాలుష్యం.. దీపావళితో వాయు కాలుష్యం చేస్తున్నామని విమర్శించారు. రాష్ట్రంలో బడ్జెట్ కొరత ఉన్నందున పండుగలు నిర్వహిండం మానుకుందామనీ ఆయన సూచించారు. అయితే ఇస్రో పట్ల ఆయన చేసిన కామెంట్లపై వ్యతిరేకత వస్తోంది. ఆయన కాకినాడలో ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసినప్పడు అక్కడ మరో ఎంపీ తోట నరసింహం కూడా ఉన్నారు.
కాగా రవీంద్రబాబు కొద్దినెలల కిందట భారత సైన్యంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్రీగా మద్యం ఇస్తారనే చాలామంది సైన్యంలో చేరుతున్నారని ఆయన అప్పట్లో అన్నారు.. అంతేకాదు.. సైనికులకు కల్పించే సదుపాయాలనూ తప్పుపట్టారు. ఇప్పుడాయన ఇస్రోకు గురిపెట్టారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నోటి దురుసు ఎంపీగా ముద్రపడుతున్నారు.