Begin typing your search above and press return to search.
'కాలు జారాం కడుపయింది..': ఎంపీ రఘురామకృష్ణ సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 17 Dec 2021 6:38 AM GMTవైసీపీలో కొనసాగుతూ ఆ పార్టీపైనే విమర్శలు చేసే ఏకైక ఎంపీ రఘురామకృష్ణం రాజు. వైసీపీ అధినేత జగన్ వ్యవహారాలు నచ్చక అతనిపై విమర్శలు చేసిన ఆయన భారీగానే ప్రతిఫలాన్ని ఎదుర్కొన్నారు..! అయితే అప్పటి నుంచి ఆగక మరింత రెచ్చిపోతున్నారు ఈ ఎంపీ.
ప్రతీ విషయంలోనూ జగన్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ.. సీఎంకు కంట్లో నలుసుగా మారారు. తాను జీవితంలో దెబ్బలు తినలేదని.. అలాంటిది పోలీసులతో దెబ్బలు తినిపించారు జగన్ అంటూ హాట్ కామెంట్లు చేశారు.
అయితే ఆయన వైసీపీపై విమర్శలు చేయడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఆర్ఆర్ఆర్ ను హైలెట్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రొగ్రాంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇందులో ఎంపీ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ ‘ పాదయాత్రలో జగన్ పూర్తిగా మారిపోయాడని, తాను ఎలా ఉన్నా చిన్న పిల్లలను దగ్గరకు తీసుకున్నాడని ప్రశాంత్ కిశోర్ నాతో చెప్పారు. దీంతో అతని మాయమాటలు నమ్మి మళ్లీ జగన్ టీంలో చేరాల్సి వచ్చింది.
కొందరిని వేశ్య గృహానికి అమ్మేసినట్లు తనను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడారు.’ అని ఎంపీ అన్నారు. అయితే ఈ సందర్భంలో రఘురామ ‘ కాలు జారాం కడుపయింది..’.. అనగానే ఏబీఎన్ రాధాకృష్ణ ‘కడుపు అవ్వలేదు.. కాళ్లు వాచాయి’.. అని పంచ్ వేశారు.
‘తాను చిన్నప్పటి నుంచే సినిమాల్లో ఫైటింగ్ సీన్లు చూసి భయపడేవాణ్ణి. ఎందుకంటే జీవితంలో ఎవరితో దెబ్బలు తినలేదు. అలాంటిది మొదటిసారి నాపై పోలీసోళ్లు తమ ప్రతాపమంతా చూపించారు. ఇక పోలీసుల్లో ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తే.. అయినా తాను బాధపడుతున్న తీరును చూసి అందరికంటే ఎక్కువ ఆనందం పొందారు.’ అని అన్నారు.
‘ప్రధాన మంత్రి మోడీతో నాక అపాయింట్మెంట్ కావాలంటే.. జగన్ లా కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. సీఎం ప్రాథేయపడినంతగా నేను శ్రమపడాల్సిన అవసరం లేదు. అలాంటిది నన్ను చట్టసభల్లో కొందరు ‘లు..’ అనే పదంతో దూషించారు. వారు అలాంటి పదం వాడుతుంటూ జగన మురిసిపోయారు. అలాగే జగన్..నా మసను దోచావ్’ అని ఆర్ఆర్ఆర్ అన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆదివారం ప్రసారం కానుంది.
వైసీపీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ గత కొన్ని నెలలుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ వద్దకు వెళ్లి, అతని వ్యవహార శైలి సరిగా లేదని, అతనిలో మరో అపరచితుడు ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీని వీడిన రఘురామకృష్ణం రాజు మళ్లీ గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఆ తరువా ఎంపీగా గెలిచారు.
అయితే జగన్ మారాడనుకున్నా.. కానీ అలాగే ఉన్నాడు.. అలాగే ఉంటే నాకు నచ్చదు అందుకు ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని అంటున్నారు. కొన్ని మీడియా సంస్థల్లో జగన్ కు వ్యతిరేకంగా ఎన్ని కామెట్లు చేస్తున్నా పార్టీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పార్లమెంట్లో అతనిపై చర్యలు తీసుకోవాలని లోక్ సభకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని గతంలో అనుకున్నారు. ఈ సమయంలో అలాంటి చర్యలకు పాల్పడితే ఆర్ఆర్ఆర్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఎంపీ మాత్రం పలు సందర్భాల్లో జగన్ పై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఏబీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం వీడియోలో ఏ విధంగా మాట్లాడాలో చూడాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.