Begin typing your search above and press return to search.
ఎంపీ రఘురామ జోస్యం.. 48 గంటల్లో కీలక అరెస్టు
By: Tupaki Desk | 17 April 2023 9:58 AM GMTఎప్పుడు మాట్లాడాలన్న విషయం పై ఎలాంటి పరిమితులు లేకుండా.. విషయం ఏమైనా తన టార్గెట్ అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అదే పనిగా నోరు పారేసుకునే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మరోసారి చెలరేగిపోయారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర జోస్యాన్ని చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసులో మరో కీలక అరెస్టు ఉంటుందని. అది కూడా రానున్న 48 గంటల్లో చోటు చేసుకుంటుందని పేర్కొనటం గమనార్హం. తాను చెబుతున్న కీలక అరెస్టు నాలుగు గంటల్లో జరుగుతుందా? 48 గంటలు పడుతుందా? అన్నది మాత్రం తేలాల్సి ఉందన్నారు. వివేకా హత్య కేసులో తమ వాదనను వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన న్యాయవాదితో పాటు సీబీఐ తరఫు న్యాయవాదితో వాదనలు వినిపించనున్నట్లుగా పేర్కొన్నారు.
ఇప్పుడు జరిగిన రెండుకీలక అరెస్టులతో పాటు మూడో అరెస్టు జరిగితే.. సీబీఐ అధికారులు తమ విచారణ తాము చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. అయితే.. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఏప్రిల్ 30లోగా పూర్తి చేసే అవకాశాలు లేవని చెప్పారు. రాజు రాణి వ్యక్తిగత సహాయకులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లుగా చెప్పిన రఘురామ.. రాజు.. రాణిని విచారించటానికి కోటలోకి సీబీఐను అనుమతిస్తారా? అన్నసందేహాన్ని వ్యక్తం చేశారు.
విచారణకు పిలిస్తే రాజు.. రాణి హాజరవుతారా? అన్నది సందేహమే అన్న ఆయన.. మరిన్నికీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడలేరని.. ఘాటు విమర్శలు చేయలేరన్న ఆయన.. ప్రత్యేక హోదా.. పోలవరం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చించేందుకు ఢిల్లీకికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా.. తనదైన జోస్యంతో రఘురామ మరోసారి వార్తల్లో నిలిచారని చెప్పాలి.