Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నా.. రాజీనామా చేస్తా: వైసీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   12 March 2021 4:35 AM GMT
పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నా.. రాజీనామా చేస్తా: వైసీపీ ఎంపీ
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారుదీనికి ఎంపీ రఘురామ సైతం గట్టిగా బదులిచ్చాడు. వీరిద్దరి వాదప్రతివాదనలు వైసీపీలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా. రఘురామ వైసీపీలో బ్లాక్ షీప్ అంటూ మంత్రి పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయనకు సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి సవాల్ చేశారు.

వైసీపీ ఎంపీగా ఉంటూ సీఎం జగన్ సహా వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న రఘురామ బీజేపీ అండతో వైసీపీ ప్రభుత్వాన్ని కొద్దిరోజులుగా ఇరుకుపెడుతున్నరన్న ఆరోపణలున్నాయి. ఇప్పటిదాకా దీనిపై పెద్దగా స్పందించని ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ వైఖరిపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగారు.

పోలవరం గురించి అమిత్ షాతో జగన్ మాట్లాకపోవడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఆడిపోసుకున్నారు. అమిత్ షాతో మాట్లాడకుండా.. మాట్లాడినట్టు అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేస్తారా? అని ప్రశ్నించారు.

*సవాల్ స్వీకరిస్తున్నానన్న రఘురామకృష్ణం రాజు
రాజీనామా చేసి తిరిగి గెలవాలన్నా మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్టు ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. తాను గెలిస్తే జగన్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి మళ్లీ ఎన్నికలు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు. దీనికి రఘురామ కౌంటర్ ఇచ్చారు. తానంతట తాను వైసీపీలోకి రాలేదని.. కాళ్లు పట్టుకొని బతిమిలితేనే తాను వచ్చానని ఎంపీ రఘురామ చెప్పారు. అటు తాను ఎప్పుడూ జగన్ ను విమర్శించలేదని.. ఆయన ప్రభుత్వ విధానాలు, తప్పు చేస్తున్న వవారిపైనే విమర్శలు చేశానని క్లారిటీ ఇచ్చారు.