Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామ డిశ్చార్జ్.. వెంటనే ఢిల్లీకి !

By:  Tupaki Desk   |   26 May 2021 7:36 AM GMT
ఎంపీ రఘురామ  డిశ్చార్జ్.. వెంటనే ఢిల్లీకి !
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ రఘురామరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కొద్దిసేపటి క్రితమే అయ్యారు. ఎంపీ రఘురామ డిశ్చార్జ్ అవడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని అయన తరపు న్యాయవాదులు చెప్తూ వచ్చారు. కానీ, రెండు రోజుల్లోనే ఆయన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి , బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రఘురామరాజు ఢిల్లీ చేరుకోనున్నారని తెలుస్తుంది.

దీనితో ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు రాగానే మరోసారి అదుపులోకి తీసుకోవాలని, గుంటూరు అర్బన్ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగానే కనిపిస్తోంది. అర్బన్ ఎస్పీకి రఘురామ తరపు న్యాయవాదులు కోర్టు ధిక్కార నోటీసులు పంపించడంతో ఆయనను గుంటూరు తీసుకు వచ్చేందుకు పంపిన ప్రత్యేక బృందాలను వెనక్కి పిలిపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో ఉంటే ఏపీ పోలీసులు ఏదో ఓ కేసు పెట్టి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఓ ప్రణాళిక ప్రకారం , డిశ్చార్జ్‌ ను రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్న రఘురామ , ఈ సమయంలోనే ఢిల్లీకి ప్రత్యేక చార్టర్డ్ విమానం ఆరెంజ్ చేసుకొని , అంతా రెడీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయి డైరెక్ట్ గా హాస్పిటల్ నుండి ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ కి పయనమైనట్టు తెలుస్తుంది. అలాగే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొందరు పెద్దలని కలిసి , తనపై ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి , అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేసిందని వివరించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అయన అక్కడే తన నివాసం లో కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు.