Begin typing your search above and press return to search.
కేంద్రం పెద్దలకు జగన్ పై ఎంపీ రఘురామ ఫిర్యాదు
By: Tupaki Desk | 30 May 2021 12:14 PM GMTఏపీ సీఎం జగన్ తో వైరం పెట్టుకొని రాజద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన ఎంపీ రఘురామ ఇప్పుడు ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని పెద్దలను కలుస్తూ తన గోడు వెల్లబోసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ పై కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు.
కొద్దిరోజులు జైలు, ఆస్పత్రుల్లో ఉండి చికిత్స తీసుకున్న రఘురామ ప్రస్తుతం ఢిల్లీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇంకొద్ది గంటల్లో బెయిల్ రద్దుపై కోర్టు విచారణ చేపట్టనుండగా.. రఘురామ కేంద్రమంత్రులను కలుస్తూ జగన్ పై ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం.
తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో భేటి అయ్యారు. జగన్ పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక విషయాలను రాజ్ నాథ్ కు వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసే పనిలో వారి అపాయింట్ మెంట్ కోరినట్టు తెలిసింది. ఏపీ పరిణామాలు, తనపై దేశద్రోహం కేసు తదితర అంశాలను రఘురామ లేఖలో పేర్కొన్నారని తెలిసింది. వ్యక్తిగతంగా కలుసుకొని వివరించేందుకు సమయం ఇవ్వాలని ఎంపీ కోరినట్టు తెలిసింది. రాజ్ నాత్ అపాయింట్ మెంట్ ఇవ్వగా మిగతా కేంద్రం పెద్దలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.