Begin typing your search above and press return to search.

నలంద కిషోర్ ది సహజ మరణం కాదు: రఘురామ

By:  Tupaki Desk   |   27 July 2020 9:15 AM IST
నలంద కిషోర్ ది సహజ మరణం కాదు: రఘురామ
X
కొద్దిరోజులుగా వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ తనపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి జగన్ చరిష్మాతో గెలిచినా.. తాను మాత్రం వ్యక్తిగత గుర్తింపుతోనే గెలిచానని స్పష్టం చేశారు.

మంత్రి గంటా శ్రీనివాసరావుతో గొడవలు ఉంటే మంత్రి అవంతి శ్రీనివాసరావు చూసుకోవాలని రఘురామ అన్నారు. కానీ కింది శ్రేణులపై ప్రతాపం చూపించడం ఏంటి అని ప్రశ్నించారు. టీడీపీ నేత నలంద కిశోర్ ది సహజ మరణం కాదు అని రఘురామ ఆరోపించారు. అతడిని పోలీసులు కర్నూలు తీసుకెళ్లడం వల్లే చనిపోయాడని పేర్కొన్నారు.

ఇక విశాఖ రాజధాని కన్నా అమరావతి రాజధానిగా సరిపోతుందని.. రాష్ట్రంలో ఎక్కువమంది కోరుకుంటున్నారని రఘురామ తెలిపారు.

ఇక రఘురామకు మంత్రి అవంతి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర వ్యవహారాల జోలికొస్తే ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ భిక్షతో గెలిచి విపక్షంలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. జగన్ ను కాదన్న వారి పరిస్థితి ఏమైందో చూసుకోవాలని హెచ్చరించారు. కరోనాతో నలంద కిశోర్ చనిపోతే రాజకీయం చేయడం సరికాదన్నారు.