Begin typing your search above and press return to search.

పిల్ల‌ల్ని చిత‌క్కొట్టేసిన ఆ రాష్ట్ర మంత్రి..

By:  Tupaki Desk   |   31 May 2017 7:59 AM GMT
పిల్ల‌ల్ని చిత‌క్కొట్టేసిన ఆ రాష్ట్ర మంత్రి..
X
మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి ఒక‌రు అత్యుత్సాహంతో దారుణానికి పాల్ప‌డ్డారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ పౌర స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి మంగ‌ళ‌వారం దిండోరి ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఒక పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు. అప్ప‌టివ‌ర‌కూ బాగానే ఉన్న ఆయ‌న‌లో పెళ్లి మేళ‌తాళాలు ఆయ‌న‌లోని మ‌రో మ‌నిషిని నిద్ర లేపిన‌ట్లున్నాయ్‌. అంతే.. అక్క‌డి వారితో క‌లిసి మేళ‌తాళాల‌కు ల‌య‌బ‌ద్ధంగా డ్యాన్స్ చేయ‌టం మొద‌లెట్టారు. అంత పెద్ద మంత్రే డ్యాన్స్ చేస్తుండ‌టంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా హుషారెక్కిపోయింది.

డ్యాన్స్ తో స‌రి పెట్ట‌ని మంత్రి ఓం ప్ర‌కాష్ ధ్రువే.. చేతిలో క‌రెన్సీ నోట్ల‌ను తీసుకుంటూ.. జ‌నం మీద‌కు విసిరేశారు. అప్ప‌టివ‌ర‌కూ ఉత్సాహంగా డ్యాన్సు వేసిన జ‌నాల దృష్టి నోట్ల‌పై ప‌డింది. క‌రెన్సీ నోట్ల‌ను అందుకునేందుకు పిల్ల‌లు ఎగ‌బ‌డ్డారు. తాను నోట్లు విసిరితే అలా చూస్తుండాలే కానీ.. నోట్ల‌ను తీసుకోవ‌టానికి ఎగ‌బ‌డ‌టం ఏమిటంటూ తీవ్ర ఆగ్ర‌హానికి గురైన మంత్రివ‌ర్యులు.. త‌న డ్యాన్స్‌ ను డిస్ట్ర‌బ్ చేసిన‌ట్లుగా ఫీల్ అయి పిల్ల‌ల్ని చిత‌క్కొట్టేశారు. ఆ కొట్ట‌టం ఎంత తీవ్రంగా ఉందంటే.. వారిని ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ఉత్సాహంతో ముందుకొచ్చిన పిల్ల‌ల్ని అలా కొట్టేస్తారా? అంటూ మంత్రి తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ ఉదంతం వివాదాస్ప‌దంగా మారి.. మంత్రికి కొత్త క‌ష్టాన్ని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. తాను చేసిన వెధ‌వ ప‌నికి విమ‌ర్శ‌లు రావ‌టంతో ఆయ‌న గ‌ప్ చుప్ అయిపోయి.. ఎవ‌రికి అందుబాటులోకి రాకుండా ఉండిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/