Begin typing your search above and press return to search.

పార్లమెంటుకు సైకిల్ మీద వచ్చిన బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   27 April 2016 4:55 PM GMT
పార్లమెంటుకు సైకిల్ మీద వచ్చిన బీజేపీ ఎంపీ
X
పార్లమెంటు దగ్గర కొత్త కొత్త దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పార్లమెంటుకు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సైకిల్ మీద రావటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్నసరిబేసి విధానంతో ఆయన సైకిల్ మీద వచ్చారు. తన దగ్గరున్న కారు సరి సంఖ్యతో ఉండటం.. బుధవారం బేసి సంఖ్యతో ఉన్న వాహనాల్ని మాత్రమే అనుమతించే అవకాశం ఉండటంతో ఆయన తన దగ్గర ఉన్న సైకిల్ తో పార్లమెంటుకు బయలుదేరినట్లు చెప్పారు.

అసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన సైకిల్ వినియోగం గురించి మనోజ్ తివారీ కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. అత్యవసర పనుల కోసం తాను సైకిల్ దగ్గర ఉంచుకుంటానని.. ఏదైనా వాహనం అందుబాటులో లేకపోతే తాను సైకిల్ మీద ప్రయాణం చేసే విషయాన్ని వెల్లడించారు. ఇష్టం కన్నా కూడా.. అవసరంతోనే పార్లమెంటుకు సైకిల్ మీద వచ్చినట్లుగా ఈ బీజేపీ ఎంపీ వెల్లడించారు. సైకిల్ మీద పార్లమెంటుకు రావటాన్ని గొప్పగా చెప్పుకోకుండా చాలా చిన్న విషయంగా మనోజ్ తివారీ చెప్పిన తీరు పలువురిని ఆకట్టుకుంది.