Begin typing your search above and press return to search.

మోడీకి బీజేపీ ఎంపీల స‌వాల్‌

By:  Tupaki Desk   |   13 Nov 2015 1:30 PM GMT
మోడీకి బీజేపీ ఎంపీల స‌వాల్‌
X
బీహార్ ఎన్నికల ఓటమి ప్రకంపనలు బీజేపీలో ఇంకా సద్దుమణగలేదు. పార్టీ అగ్ర నేతలు ఎల్‌ కే అద్వానీ, ముర‌ళీమ‌నోమ‌ర్‌ జోషీ - అరుణ్ శౌరీ - అనంత‌కుమార్‌ లు ఓట‌మి బాధ్యుల‌ని తేల్చాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌తంగా ఎవ్వ‌రినీ బాధ్యుల‌ను చేయ‌లేమ‌ని...ఉమ్మ‌డి బాధ్య‌త ఉంటుంద‌ని పార్టీ అగ్ర‌నేతలు తెలివిగా త‌ప్పించుకున్నారు. అయితే తాజాగా మరో ఇద్దరు సీనియర్ నేతలు - ఎంపీలు పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. ఏకంగా స‌వాల్ విసిరారు.

బీహార్ ఎన్నికలలో ఓటమికి పార్టీ వ్యూహాల లోపమే కారణమని బీజేపీ సీనియర్ నాయకుడు - ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. ఈ విష‌యంలో పార్టీ పెద్ద‌లు స‌రైన విధంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని మండిప‌డ్డారు. బీజేపీకి అంతా బాగుంద‌నుకునే స‌మ‌యంలో ఘోర ప‌రాజ‌యం ఎలా జ‌రిగిందో క‌నుక్కోవాల‌ని డిమాండ్ చేశారు. తివారీ తీవ్ర స్వ‌రానికి మరో ఎంపీ ఆర్కే సింగ్ మద్దతు పలికారు. బీహార్ ఓటమిపై సమీక్షించాలనీ, ఎక్కడ తప్పు జరిగిందో తేలాలని డిమాండ్ చేశారు. పార్టీ ఓటమికి బాధ్యులెవరన్నది తేల్చాలన్న సీనియ‌ర్ల‌ డిమాండ్ కు వీరిరువురూ మద్దతు పలక‌డం ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే ఉన్న సీనియ‌ర్ల అస‌హ‌నానికి తోడుగా సీనియ‌ర్ ఎంపీల‌యిన తివారీ - ఆర్కే సింగ్ లు తెర‌మీద‌కు రావ‌డం బీజేపీని ఇరుకున పెట్టే ప‌రిణామ‌మేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.