Begin typing your search above and press return to search.

కాళీపై నోరుజారి.. అడ్డంగా బుక్కైన ఆ లేడీ ఎంపీ

By:  Tupaki Desk   |   6 July 2022 11:30 PM GMT
కాళీపై నోరుజారి.. అడ్డంగా బుక్కైన ఆ లేడీ ఎంపీ
X
హిందూ దేవుళ్లపై అనుచిత కామెంట్లు.. వారి పట్ల అనుచిత ప్రవర్తన చేసే వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వారిపై కేసులు నమోదవుతున్నాయి. ‘కాళీ’ పేరుతో తెరకెక్కిస్తున్న డాక్యుమెంటరీ సినిమాలో కాళి మాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు డైరెక్టర్ లీనా మనిమేకలై.

ఈ పోస్టర్ దేశంలో తీవ్ర దుమారం రేపింది. హిందు సంఘాలు సదురు దర్శకుడి తీరుపై భగ్గుమన్నాయి. దేశంలోని పలు రాస్ట్రాల్లో డైరెక్టర్ తోపాటు పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పోస్టర్ పై తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మైత్రీ కూడా కామెంట్ చేసింది. ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

కాళీ మాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ మహువా మైత్రీపై మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కేసు నమోదైంది. మతపరమైన భావాలను కించపరిచినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయని.. హిందూ మతస్థుల మనోభావాలను ఎంపీ మహువా అవమానించారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హిందూదేవతలను కించపరిచడాన్ని ఎప్పటికీ సహించబోమన్నారు.

టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. పార్టీ అధికారిక ట్విటర్ లో ఎంపీ మహువా మైత్రీ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. పార్టీకి సంబంధం లేదని తెలిపింది. అనంతరం ఎంపీ తన అధికారిక ట్విటర్ ద్వారా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఎంపీ తన తప్పు తెలుసుకొని తాను ఏ చిత్రానికి, ఏ పోస్టర్ కు మద్దతు ఇవ్వలేదని.. తాను ధూమపానం అనే పదాన్ని వాడలేదని వివరణ ఇచ్చింది. ఆమెను టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.

ఇటీవల రాజస్థాన్ లోనూ ఓ మతంపైకామెంట్ చేసినందుకు హత్య చేశారు. ఇప్పుడు హిందూ దేవుళ్లపై ఎంపీనే కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. మతం పేరిట ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టవద్దని పలువురు హితవు పలుకుతున్నారు.