Begin typing your search above and press return to search.

ఎంపీకి చుక్క‌లు చూపించిన కార్పొరేట్ ఆస్ప‌త్రి

By:  Tupaki Desk   |   19 April 2016 6:25 AM
ఎంపీకి చుక్క‌లు చూపించిన కార్పొరేట్ ఆస్ప‌త్రి
X
కార్పొరేట్ ఆస్ప‌త్రుల వైద్య చికిత్స - స‌మ‌న్వ‌యం చేసుకునే తీరుపై తెలంగాణ‌కు చెందిన‌ ఎంపీ ఒక‌రు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాక్షాత్తు చ‌ట్ట‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించే త‌న‌కే తీవ్ర ఇక్కట్లు ఎదుర‌య్యాయ‌ని పేర్కొన్నారు. య‌శోదా ఆస్ప‌త్రి యాజ‌మాన్యంచే షాక్ తిన్న ఆ సీనియ‌ర్ నాయ‌కుడి పేరు ఎంఏ ఖాన్‌. ఆయ‌న త‌న‌గోడును ఏకంగా సీఎం కేసీఆర్‌ కే మొర‌పెట్టుకున్నాడంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంఎ ఖాన్ మీడియాకు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఖాన్ స‌తీమ‌ణికి విరేచనాల కారణంగా కలిగిన నీరసాన్ని దృష్టిలో ఉంచుకుని మలక్‌ పేట్‌ యశోదా ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్ళారు. అందులో ప్రత్యేక చికిత్స అందించకపోయినా కేవలం 24 గంటలుపాటు ఆసుపత్రిలో ఉన్నందుకు 25 వేల రూపాయల బిల్లు వేశారు. దీంతోపాటు మరో 40 వేల రూపాయలను అడ్వాన్స్‌ గా చెల్లించాలని కూడా ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్‌ చేసింది. తన వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీం కార్డు ఉందని ఎంపీ చెప్పారు. అయితే వాటిని ఆమోదించమని తేల్చిచెప్పిన యాజ‌మాన్యం డబ్బులు చెల్లించాల్సిందేనని కట్టడి చేశాయి. అప్పటి వరకు ఎంపీ భార్యకు వైద్య చికిత్సలు నిలిపివేశారు. రూ.15000 చెల్లించగా అప్పుడు తిరిగి వైద్యం ప్రారంభించారు. ఈ విషయంపై ఎంపి కేంద్ర పార్లమెంటరీ కమిటీ ఆన్‌ పిటిషన్స్‌ కు ఫిర్యాదు చేశారు. చట్టసభల్లో సభ్యుడైన వారికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుడి సంగతి ఎలా ఉంటుందని ఎంపీ లేఖలో ప్రస్తావించారు.