Begin typing your search above and press return to search.

వందేళ్ల కిందటే అంత స్మార్టా...!!

By:  Tupaki Desk   |   16 Sep 2015 7:52 AM GMT
వందేళ్ల కిందటే అంత స్మార్టా...!!
X
హైదరాబాద్ ఎప్పటి నుంచో స్మార్ట్‌ సిటీగా ఉందని తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అంటున్నారు. వందేళ్ల కిందటే భాగ్యనగరానికి స్మార్ట్‌ సిటీ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ నగరవాసులు హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ చేయడానికి ముందుకురావాలని ఎంపీ కొండా పిలుపునిచ్చారు.

స్మార్ట్‌ గా సిటీగా అభివృద్ధి చెందడానికి సోషల్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలన్నారు. నగరం విస్తరించినా.. జనాభా పెరిగినా.. కృష్ణా మూడోదశ, గోదావరి జలాలతో నగరవాసులకు నీళ్లందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో నగరాల అభివృద్ధిపై దృష్టి సారించిందని వివరించారు. 2017 నాటికి మెట్రో పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు.

అయితే... హైదరాబాద్ మొదటినుంచీ అభివృద్ధి చెందిన నగరమే అని అందరూ అంగీకరించినా... నిజాంల కాలంలో సిస్టమేటిగ్గా దీన్ని డెవలప్ చేశారని తెలిసినా మరీ ఇప్పటి హైదరాబాద్ లో నానా పాట్లు పడుతున్న నగరవాసులు ఎవరైనా సరే, వందేళ్ల కిందటే ఇది స్మార్ట్ సిటీ అంటే నమ్ముతారా..? ఇప్పుడెందుకిలా ఉందని ప్రశ్నించరూ..?