Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లో కేటీఆర్ వేరు కాపురం: కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   10 Feb 2023 7:48 PM GMT
ప్రగతిభవన్ లో కేటీఆర్ వేరు కాపురం: కోమటిరెడ్డి
X
ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కలిసి ఉంటున్నారని ఇన్నాళ్లు అందరికీ తెలుసు. ఇద్దరు తండ్రీకొడుకులు తెలంగాణను ఇక్కడి నుంచే పాలిస్తున్నారని అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రగతి భవన్ లోనే కేటీఆర్ వేరు కాపురం పెట్టారని.. కేసీఆర్, కేటీఆర్ లు వేర్వేరుగా ఉంటూ బయటకు తెలియనివ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తెలంగాణకు సీఎం అవ్వగానే కేసీఆర్ ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న సీఎం నివాసం ‘ప్రగతిభవన్’. దీనిపై ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ నేతలు పట్టించుకోరు. అదో పెట్టని కోటగా కేసీఆర్ మార్చేశారని..ప్రజలకు అందులోకి ఎంట్రీ లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయితే కేసీఆర్, కేటీఆర్ నివాసమైన దీని గురించి ఏ వార్త అయినా వైరల్ అవుతుంటుంది.

ప్రగతి భవన్ లోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎంగా కేసీఆర్ కట్టిన ప్రగతిభవన్ లో కేసీఆర్, ఆయన భార్య మాత్రమే ఉంటున్నారని.. గతంలో సీఎంగా వైఎస్ఆర్ కట్టిన ఇంటిని కేటీఆర్ కుటుంబం వాడుకుంటోందని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కామెంట్ చేయడంతో నిజమేనా? అన్న చర్చ ప్రారంభమైంది.

ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోమటిరెడ్డి ‘కేసీఆర్ కు అంత పెద్ద ప్రగతిభవన్ అవసరమా? ప్రజాధనం దుర్వినియోగం చేసి కట్టారని’ విమర్శించారు. కేసీఆర్ ఉండేందుకు డబుల్ బెడ్ రూం సరిపోతుందన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉంటే.. అదే కాంపౌండ్ లో ఉన్న బిల్డింగ్ లో కేటీఆర్ ఉంటున్నారని.. ఆ భవనంలో వైఎస్ఆర్ ఉండేవారని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో నిజనిజాలు ఏమిటో కానీ.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.