Begin typing your search above and press return to search.

45రోజుల్లో అసెంబ్లీ రద్దు... ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   10 July 2023 3:58 PM GMT
45రోజుల్లో అసెంబ్లీ రద్దు... ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
X
తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి లోబడి అయినా.. పార్టీకి ఎగినెస్ట్ గా అయినా సంచలన వ్యాఖ్యలు చేయడం లో ముందుండే నాయకుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకర ని అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఈయన కు మరింతగా కలిసొచ్చిందని చెబుతుంటారు. ఈ క్రమంలో మరోసారి సంచలన ప్రకటనలు చేశారు కోమటిరెడ్డి.

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుందని జోస్యం చెప్పారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల కు సిద్దంగా ఉండాల ని కోరుతూ.. గ్రూప్‌ రాజకీయాలు చేయవద్దని సూచించారు.

ఇదే సమయం లో నియోజకవర్గాల్లో ఇద్దరు సమాన స్థాయి నాయకులు ఉంటే.. ఒకరికి ఎమ్మెల్యే టికెట్.. మరొకరికి ఎమ్మెల్సీ లేదా జెడ్పీ చైర్మన్ ఇప్పించే బాధ్యత పార్టీ సీనియర్ నేత గా తాను తీసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అండగా ఉంటున్నానని తెలిపారు.

ఇక పదవులు విషయం పైనా స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి... ఏ పదవి అయినా ఒక్కటే ఉంటుందని.. ఒకరికే వస్తుందని.. మరోసారి ఇంకొకరికి అవకాశం వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నేత గా ఉన్న తనకు పీసీసీ దక్కకపోవడం పై కొన్ని రోజులు బాధపడ్డ మాట వాస్తవేమని కోమటిరెడ్డి అంగీకరించారు.

ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులుల్, బాదలు లేకుండద... తాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలతో కలిసి పనిచేస్తున్నట్టుగా కోమటిరెడ్డి చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఏ పార్టీ లో అయినా గ్రూపులు సహజం అని అభిప్రాయపడిన కోమటిరెడ్డి... బీఆరెస్స్ లో కూడా గ్రూపులు ఉన్నాయని అన్నారు. అందుకు ఉదాహరణగా... ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆరెస్స్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు కడుపు లో కత్తులు పెట్టి పొడుసుకోవడానికి సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు!

కాగా... సుమారు రెండు వారాల క్రితం తెలంగాణ ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ తర్వాత మీడియా తో చిట్‌ చాట్‌ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గానే పోటీ చేస్తున్నట్లు చెప్పిన ఆయన... అవే తనకు చివరి ఎన్నికలు అని, ఆ తర్వాత రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.