Begin typing your search above and press return to search.

జగన్ కి రిక్వెస్టు పెట్టిన ట్విట్టరు ఎంపీ

By:  Tupaki Desk   |   20 July 2019 9:38 AM GMT
జగన్ కి రిక్వెస్టు పెట్టిన ట్విట్టరు ఎంపీ
X
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ... రోజుకో కలకం సృష్టిస్తున్నాడు. గెలిచినపప్పటి నుంచి భౌతిక అజ్జాత వాసం పాటిస్తూ కేవలం ఆన్ లైన్లోనే సంచరిస్తున్నారు. విపక్షంలోకి వెళ్లాక అతను తెలుగుదేశంలో ఉండాలో పార్టీ మారాలో తెలియని అయోయంతో కనిపిస్తున్నారు. అతను పార్టీ మారుతారని తెలుగుదేశం వాళ్లే చర్చించుకునేదాకా వెళ్లింది వ్యవహారం. ఆన్లైన్లోనే చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చి బాబు పరువు తీసేసిన నాని ముఖ్యమంత్రి జగన్ కి మాత్రం గౌరవంగా ఒక రిక్వెస్టు పెట్టారు.

ఒక ప్రముఖ పత్రికలో విజయవాడ రోడ్ల గురించి వచ్చిన వార్తను ముఖ్యమంత్రి జగన్ కి, విజయవాడ కమిషనర్ కి ట్యాగ్ చేస్తూ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని విన్నవించారు. అందరి మీద దూకుడుగా వెళ్తున్న నాని ముఖ్యమంత్రి జగన్ తో మాత్రం వివాదాస్పదంగా వ్యవహరించదలుచుకోలేదని ఆయన ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. ఆయన పెట్టిన ట్వీట్ ఇది...

’’ముఖ్యమంత్రి గారు నగరంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా తయారై నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేయించండి సార్.‘‘ అని ముఖ్యమంత్రికి ఒక ట్వీట్ ద్వారా విన్నవించారు నాని. సొంత పార్టీ అధినేతకు అల్టిమేటాలు, ప్రత్యర్థి పార్టీ అధినేతకు రిక్వెస్టులా అని కొందరు ఆయనపై వ్యంగాస్త్రాలు వేసినా ఆయనేమీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

ఇటీవల కేశినేని నాని - బుద్ధా వెంకన్న మధ్య వార్ ఎంత ఘోరంగా జరిగిందీ అందరికీ తెలుసు. ఎవరు ఎంత తప్పుడు వ్యక్తులో ఒకరికి ఒకరు నిరూపించుకున్నారు. ఈ అవకాశాన్ని వాడుకు పీవీపీ ఇద్దరినీ విమర్శించారు. ముఖ్యంగా నానిపై ఘాటు విమర్శలు చేసి నీ భవిష్యత్తుపై ముందు క్లారిటీ తెచ్చుకో అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.