Begin typing your search above and press return to search.
నోటి దురద.. కామెంట్ల వరద.. ఆ ఎంపీని ఒంటరిని చేశాయా?
By: Tupaki Desk | 17 Nov 2020 3:45 AM GMTరాజకీయాల్లో ప్రతి అడుగూ.. ఆచితూచి వేయాలి. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. నాయకుడు పుంజుకోవడం అనేది కల్లే! దీనికి ప్రతీకగా నిలుస్తు న్నారు.. టీడీపీ నాయకుడు.. విజయవాడ ఎంపీ కేశినేని నాని. ప్రత్యర్థులపై ఎక్కు పెట్టాల్సిన విమర్శనా స్త్రాలను ఆయన తెలిసి చేశారో.. తెలియక చేశారో.. తెలియదు కానీ.. సొంత పార్టీ నేతలపైనే ఎక్కు పెట్టారు. పార్టీ అధినేత చంద్రబాబునే ఆయన టార్గెట్ చేశారు. అదేసమయంలో విజయవాడ రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తన సొంత సామాజిక వర్గం కమ్మ నేతలపైనా ఆయన దూకుడుగా ముందుకు వెళ్లారు.
అయిన దానికి, కాని దానికి పార్టీలోని కమ్మ సామాజిక వర్గం నేతలను ఆయన టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధించారు. వరుస ట్వీట్లతో పార్టీలో అసంతృప్త నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇది రాను రాను మ రింత ముదిరి. ఇప్పుడు తాను అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన విజయవాడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. టీడీపీలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. 2014లో టీడీపీ టికెట్‌పై తొలిసారి విజయవాడ ఎంపీగా గెలిచిన నాని.. గత ఏడాది వైసీపీ తుపానులోనూ తట్టుకుని నిలబడి.. పార్టీని నిలబెట్టారు. ఇది నిజంగా మెచ్చదగిన విషయం. 2019లో ఆయన గెలుపు గుర్రం ఎక్కిన తర్వాత.. చంద్రబాబు సైతం ఇదే కామెంట్ చేశారు.
కానీ, నాని వైఖరి కారణంగా.. బాబు విసిగిపోయారు. పార్టీకి పట్టుకొమ్మ వంటి కృష్ణాజిల్లాలో సొంత పార్టీ నాయకులతోనే కేశినేని నానికి పడకపోవడం, సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నేతలపైనే తీవ్రమైన కామెంట్స్ చేయడం ఆయనను పార్టీలో ఒంటరిని చేశాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో విభేదాలు.. మరింతగా నానికి పార్టీలో సెగపెట్టాయి. టీడీపీలో ఉంటూనే ఆ పార్టీలో కలిసిమెలిసి ముందుకు సాగలేకపోయారు. ఆయనకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే వచ్చింది. ఇక, ఇప్పుడా ఆ గ్యాప్ పార్టీ పదవులకు కూడా దూరం చేసిందని అంటున్నారు నాయకులు.
ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీలో అనేక పదవులను భర్తీ చేశారు. కొత్తగా పార్టీ పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్ పదవులను సృష్టించి.. నాయకులకు అప్పగించారు. ఈ క్రమంలో నానికిఎక్కడా చోటు పెట్టకపోవడం గమనార్హం. బెజవాడ పార్లమెంట్ జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, అసలు సోయిలోనే లేని నెట్టెం రఘురామ్‌ను నియమించారు. అంతేకాదు, కృష్ణా జిల్లా నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, బొండా ఉమాలను తీసుకున్నారు. కొందరు నాయకులకైతే పార్టీ కమిటీలలో రెండేసి పదవులు ఇచ్చారు. అదేసమయంలో నానిని అసలు ప్రాధాన్య జాబితాలోకి కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు.. నోటి దురద.. కామెంట్ల వరద.. ఆ ఎంపీని ఒంటరిని చేశాయని అంటున్నారు. మరి ఇప్పటికైనాఆయన మారతారో లేదో చూడాలి.