Begin typing your search above and press return to search.

క‌విత‌క్క ఖాతాలో మ‌రో రికార్డు

By:  Tupaki Desk   |   24 March 2017 10:31 PM IST
క‌విత‌క్క ఖాతాలో మ‌రో రికార్డు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌ - నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రాంతంపై మ‌మ‌కారం చాటుకున్నారు. తెలంగాణ‌లోనే అతి ఎక్కువ‌గా ప‌సుపు పండించే జిల్లాగా పేరొందిన నిజామాబాద్‌లో పసుపు ఎగుమతులు - ఉత్పత్తి పెంపు కోసం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు. ఇందుకు సంబంధించి లోక్‌ సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎంపీ కవిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం వల్ల చాలా మంది పసుపు రైతులకు మేలు జరుగుతుందన్నారు. పసుపు బోర్డు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల నడ్డి విరిచేలా కేంద్రం ఇతర దేశాల నుంచి పసుపును దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించారు. పసుపు రైతుల అంశంలో కేంద్రం రాష్ర్టానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఈ బిల్లుపై లోక్‌ సభలో చర్చ జరుగనుంది. కాగా, తెలంగాణ అధికార పార్టీ నుంచి ప్రైవేట్‌ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా ఎంపీ ఘ‌న‌త‌ను క‌విత ద‌క్కించుకున్నారు.

మరోవైపు ఎంపీ జితేందర్‌ రెడ్డి సర్వీస్‌ ట్యాక్స్ 1951 చట్టం సవరణ కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా పార్లమెంట్ సభ్యులు హాజరు శాతంపై హిందుస్థాన్ టైమ్స్ రాసిన కథనంపై మండిపడ్డారు. 90 శాతం హాజరు ఉన్న తాను..9శాతం మాత్రమే సభకు హాజరవుతున్నట్లు కథనం రాసిందని, దీనిపై హిందుస్థాన్ టైమ్స్ కు నోటీస్ ఇవ్వాలని ఎంపీ జితేందర్ రెడ్డి కోరారు. గౌరవ సభ్యులపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా కథనాలు రాయడాన్ని తీవ్రంగా పరిగణించాలని జితేందర్ రెడ్డి స‌భ‌కు విన్న‌వించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/