Begin typing your search above and press return to search.

ఉత్తమ పార్లమెంట్ సభ్యురాలిగా కవిత

By:  Tupaki Desk   |   22 Jan 2019 2:15 PM IST
ఉత్తమ పార్లమెంట్ సభ్యురాలిగా కవిత
X
ఐదేళ్లకోసారి ఫేమ్ ఇండియా మ్యాగ్ జిన్ అందజేసే అవార్డుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపికయ్యారు. మ్యాగ్ జిన్ 2014-19కి భారత దేశంలోని 25 మంది ఉత్తమ పార్లమెంట్ సభ్యులను ఎంపిక చేసింది. ఇందులో కవితకు స్థానం దక్కింది. ఈ నెల 31 న్యూఢిల్లీ నిర్వహించే కార్యక్రమంలో శ్రీశాంత్ అవార్డు ప్రదానం చేయనున్నారు.

పార్లమెంట్ సభ్యురాలిగా కవిత పనితీరు గుర్తించిన మ్యాగజిన్ ‘ఆదర్శ’ విభాగంలో అవార్డుకు ఎంపిక చేసింది. మ్యాగ్ జిన్ ఎంపిక చేసిన 25 మందిలో కవిత ఒక్కరే మహిళా సభ్యురాలు ఉండడం విశేషం. కాగా దక్షిణ భారత దేశం నుంచి కేవలం ఇద్దరు మాత్రమే అవార్డులకు ఎంపికయ్యారు. అందులో ఒకరు కవిత కాగా మరొకరు ఉత్తరాఖండ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ‘ఎక్సలెన్స్’ విభాగంలో అవార్డు దక్కించుకున్నారు.

పది అంశాల ప్రాతిపదికన మ్యాగజిన్ దేశంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని అవార్డుకు ఎంపిక చేసింది. కవిత అవార్డుకు ఎంపికనందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. ‘ఆదర్శ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికవడం తెలంగాణ ప్రజలు గర్వించదగిన సమయం. నీకు అభినందనలు పాప్’ అని కేటీఆర్ ట్విట్ చేశారు.