Begin typing your search above and press return to search.
అమరావతిలో కవిత మాటలు వినాల్సిందే!
By: Tupaki Desk | 10 Feb 2017 7:16 AM GMTఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీజియన్ లో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి లాంటి గొప్ప చరిత్ర ఉన్న నగరంలో ఉమెన్ పార్లమెంటేరియన్ సదస్సు జరగడం అదృష్టమన్నారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయిన సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున జరిగే సదస్సుకు తమ పొరుగు రాష్ట్రం వేదిక కావడం విశేషమన్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సదస్సు ద్వారా అర్ధవంతమైన చర్చ జరిగి మంచి స్ఫూర్తితో తిరిగి వెళ్లాలని ఎంపీ కవిత పేర్కొన్నారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బౌద్ధమతగురువు దలైలామా కార్యక్రమంలో పాల్గొన్నారు. 92 మంది ఎంపీలు, 405 మంది ఎమ్మెల్యేలు - దేశ - విదేశాల నుంచి 12వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. కార్పొరేట్ సంస్థల ప్రముఖులు - పదివేల మంది విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. మహిళా సాధికారత-ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం నినాదంతో సదస్సు జరుగుతోంది. కాగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దేశ - విదేశాల నుంచి తరలి వచ్చే మహిళా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా పోలీసుశాఖ కృషి చేస్తోంది. వారికి బస - రవాణా - భోజన వసతి - రక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సదస్సు నిర్వహణను నాలుగు భాగాలుగా విభజించారు. ప్రధాన వేదికపై మహిళల ఉపన్యాసాలుంటాయి. రెండో వేదికలో చర్చా కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు వంటివి నిర్వహించేందుకు భారీ షామియానా ఏర్పాటు చేశారు. మరో వేదికలో భోజనం వసతి ఏర్పాటు చేశారు. నాలుగోది సాంస్కృతిక కార్యక్రమాల వేదిక. మొత్తంగా వివిధ రంగాలకు చెందిన 64 మంది ప్రధాన మహిళా ప్రతినిధులు (విఐపి) హాజరవుతున్నారు. వీరి భద్రత బాధ్యతను 64 మంది మహిళా ఉన్నతాధికారులకు అప్పగించారు. విజయవాడలోని ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రతినిధులకు 42 చోట్ల బస ఏర్పాట్లు చేశారు. విఐసిలతో పాటు ఐదు వేల మంది మహిళలు హాజరవుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేసుకున్న మహిళలే ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాల కోసం కృష్ణా నది సమీపాన భారీ వేదిక ఏర్పాటైంది. మూడు రోజులపాటు అక్కడ సంధ్యావందనం, హారతి వంటి కార్యక్రమాలుంటాయి. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను మహిళా ప్రతినిధులు, సామాన్య ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. సదస్సు తర్వాత విఐపిలను హోటళ్లకు తీసుకెళ్లేందుకు 300 బస్సులను వినియోగిస్తున్నారు. రక్షణ కోసం రెండు, మూడు బస్సులకు కలిపి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించారు. సదస్సు సమయంలో కేవలం మహిళా పోలీసులే అక్కడ విధులు నిర్వహించనున్నారు. లోపలికి, బయటకు వెళ్లే మార్గంలో తప్ప మగ పోలీసులు ఎక్కడా కనిపించరు. మహిళలు కూడా సఫారీ ధరిస్తారు. మహిళా డిఎస్ పిలు బ్లేజర్ తో విధుల్లో ఉంటారు. 600 మంది మహిళా కానిస్టేబుళ్లు - ఎనిమిది మంది డిఎస్ పిలు - ఇద్దరు ఎస్ పిలు విధుల్లో ఉంటారు. భోజనం - ఉపన్యాసాలు - చర్చలు జరిగే ప్రాంతాల్లో మహిళా పోలీసులే ఉంటారు. ఎక్కడా ఖాకీ దుస్తులు కనిపించవు. వంద మంది మహిళా పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు ధరింపజేయనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/