Begin typing your search above and press return to search.

ఏపీపై సర్జికల్ స్ట్రైక్స్.. జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Dec 2020 5:10 AM GMT
ఏపీపై సర్జికల్ స్ట్రైక్స్.. జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
X
పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. దాన్ని రాజకీయంగా వాడుకొని గత ఎన్నికల్లో గెలిచింది. అయితే సైన్యం పరంగా చేసిన ఈ స్ట్రైక్స్ బీజేపీకి బాగా పేరుతెచ్చాయి. ఇప్పుడు శత్రుదేశంపై చేసిన ఈ స్ట్రైక్స్ ను దేశంలోని పార్టీలపై ప్రయోగిస్తోంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ స్ట్రైక్స్ పనిచేశాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీలో విజయం లభించింది. దీంతో ఇప్పుడు పక్కనున్న ఏపీపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి బీజేపీ రెడీ అయినట్లు తెలుస్తోంది.

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ఆయన హాట్ కామెంట్ చేశారు. రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్దిచెబుతామని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని.. గత టీడీపీని, ఇప్పటి వైసీపీ సర్కార్ ను ఛాలెంజ్ చేస్తున్నామని.. వాళ్లు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

ఏపీలో ఇటీవల ఓ పోలీస్ అధికారి క్రిస్మస్ సంబరాలు చేయడంపై జీవీఎల్ మండిపడ్డారు. ప్రభుత్వమే మతప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని కౌంటర్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో దసరా సంబురాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు.

దేవాలయాలే దండగన్న చంద్రబాబు ఇప్పుడు హిందూయిజం గురించి మాట్లాడుతున్నాడని జీవీఎల్ ఫైర్ అయ్యారు. తిరుపతి ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని తెలిపారు.

జీవీఎల్ వ్యాఖ్యలను బట్టి ఏపీలో జరిగే తిరుపతి ఉప ఎన్నికతో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ మొదలు కాబోతున్నాయని తెలుస్తోంది. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.