Begin typing your search above and press return to search.
ఎంపీ మనమరాలి ప్రాణాలు తీసిన టపాసులు
By: Tupaki Desk | 18 Nov 2020 7:15 AM GMTదీపావళి అన్నంతనే టపాసులు గుర్తుకు వస్తాయి. అలాంటి టపాసులు వినోదంతో పాటు..కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు తావిస్తుంటాయి. అయితే.. ఈ ప్రమాదం ప్రాణాలు పోయేంతగా అన్నది చాలా చాలా అరుదుగా సాగుతుంటుంది. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. అయితే.. ఇందులోబాధితురాలు ఒక ఎంపీ మనమరాలు కావటం గమనార్హం. సాధారణంగా హై ప్రొఫైల్ కు చెందిన వారి పిల్లలు టపాసులు పేల్చే వేళలో.. వారి తల్లిదండ్రులో,. సహాయకులో ఉంటారు. అందునా చిన్న పిల్లలు అయితే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.
అందుకు భిన్నంగా.. తాజాగా యూపీకి చెందిన ఎంపీ మనమరాలి మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. అలహాబాద్ ఎంపీ రీటా బహుగుణ మనమరాలు ఆరేళ్ల కియా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇంటివద్ద స్నేహితులతో కలిసి పటాసుులు కాల్చిన వేళలో.. ఆమెకు నిప్పు అంటుకోవటం.. అది కాస్తా తీవ్ర గాయాలకు కారణమైనట్లుగా చెబుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో కియా తండ్రి మయాంక్ లక్నోలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టపాసులు కాల్చే వేళ.. ఒంటికి నిప్పు అంటుకోవటం.. గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. టపాసులతో అపాయం పొంచి ఉంటుందన్నది పాత విషయమే అయినా.. ప్రాణాలు పోయేంతగానా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.