Begin typing your search above and press return to search.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకంటే బురదలో పందులు మేలు : ఎంపీ ధర్మపురి అరవింద్ !
By: Tupaki Desk | 8 Dec 2020 9:52 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం దళారీలకి బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు కురిపించారు. రైతు చట్టాలపై కేసీఆర్, మంత్రులతో చర్చలకు సిద్ధమని చెప్పారు. ఉద్యమం అంటే ఏమిటో కేసీఆర్ కు చూపెడతామని... నియంత గడాఫీకి పట్టిన గతే చివరకు కేసీఆర్ కు పడుతుందని అన్నారు. కేసీఆర్ ను తెలంగాణ రైతులు త్వరలోనే గుడ్డలు ఊడదీసి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో ఫేక్ ఉద్యమం నడుపుతోందన్న ఆయన దుబ్బాక ఎన్నికతో మంత్రులు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీజేపీదేనని అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.
హైదరాబాదులో ధర్నా చౌక్ ను ఎత్తేసిన టీఆర్ ఎస్ కు ధర్నా చేసే హక్కు లేదని అరవింద్ మండిపడ్డారు. జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో తగిలిన షాక్ మంత్రి కేటీఆర్ కు సరిపడలేదేమోనని ఎద్దేవా చేశారు. కేటీఆర్, కవితలు కమిషన్ ఇవ్వకపోవడం వల్ల, మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో పండుతున్న పసుపును పక్కన పెట్టేసి, కమిషన్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి పసుపును దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. కోట్లాది రూపాయల కమిషన్లు పోతాయనే ఆందోళనతోనే కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. దగ్గు, జలుబు వస్తే కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రైన యశోదాకే ఎందుకు వెళ్తున్నాడు, కవిత, హరీష్ రావులు ర్పోరేట్ కాళాశాలల్లోనే తమ పెట్టుబడులు ఎందుకు పెడ్తున్నారు ? సాయంత్రమైతే కేటీఆర్ కార్పోరేట్ తరహా పార్టీలు ఎందుకు చేసుకుంటున్నాడు, అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని.. పాస్ పుస్తకం ఉన్నోడిదే భూమి అనే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చాడని ఆయన అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని అరవింద్ అన్నారు. రాజ్యాంగం గురించి తనకంటే కేసీఆర్ కు ఎక్కువకు తెలుసని, ఈ విషయాన్ని ఆయన గ్రహించాలని చెప్పారు. పశ్చిమబెంగాల్ నే బీజేపీ కొట్టబోతోందని, కేసీఆర్ తమకు ఒక లెక్క కాదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకంటే బురదలో పందులు మేలని దుయ్యబట్టారు.