Begin typing your search above and press return to search.
కోటి మొక్కల ఖర్చు రూ.500 కోట్లు.. అందులో రూ.450 కోట్లు మింగేశారట?
By: Tupaki Desk | 20 Feb 2021 6:30 AM GMTరెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు రికార్డుల్ని నమోదు చేశారు. అందులో ముఖ్యమైనది.. రికార్డు స్థాయిలో కేవలం గంట వ్యవధిలో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల్ని నాటినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమం మొత్తం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు.. జోగినపల్లి సంతోష్ కుమార్ కర్త.. కర్మ.. క్రియ అన్నట్లుగా సాగింది.
అయితే..ఈ కార్యక్రమం మీద సంచలన ఆరోపణలు.. విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఏ మాత్రం అవకాశం లభించినా.. కేసీఆర్ సర్కారును ఉతికి ఆరేసే ఆయన.. తాజాగా కోటి మొక్కలకు సంబంధించి భారీ ఆరోపణలు చేశారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కోటి మొక్కల నాటేందుకు రూ.500 కోట్లు ఖర్చు అయినట్లుగా లెక్కలు చూపిస్తున్నారని.. అందులో రూ.450 కోట్లను సీఎం కేసీఆరే బకాసురుడి మాదిరి మింగారన్నారు.
తాజాగా బీజేపీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన అర్వింద్ తాజాగా సంచలన ఆరోపణల్ని సంధించారు. రూ.500 కోట్లతో ఎన్ఆర్ఐ సెల్ పెడతానని గతంలో మాట ఇచ్చారని.. ఆ హామీని నిలబెట్టుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. సీఎం పుట్టినరోజుకు రూ.500 కోట్లు ఖర్చుపెట్టటమా? దానికి బదులుగా ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తే బాగుండేది కదా? ముఖ్యమంత్రి పుట్టిన రోజున మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై.. దుబాయ్ వరకు వెళ్లారని.. ఆ తర్వాత పరువు పోతుందని కేసీఆర్ వెనక్కి పిలిపించి పరువు కాపాడుకున్నట్లుగా చెప్పారు.
ఎంపీ అర్వింద్ తాజా వ్యాఖ్యలతో రెండు సంచలన అంశాలు తెర మీదకు వచ్చినట్లైంది. అందులో ఒకటి.. బర్త్ డే వేళ నాటిన కోటి మొక్కల ఖర్చు రూ.500 కోట్లు అయితే.. రెండోది తండ్రి పుట్టినరోజున కొడుకు కేటీఆర్ దుబాయ్ వరకు వెళ్లి రావటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. మరి.. అర్వింద్ వ్యాఖ్యలపై కేటీఆర్ కాస్తంత క్లారిటీ ఇస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.