Begin typing your search above and press return to search.
ఆ సీఎం.. కవితను కాపీ కొట్టటం ఏమిటి. అసలీ వివాదం ఏమిటి?
By: Tupaki Desk | 3 Dec 2020 2:30 PM GMTసోషల్ మీడియా పుణ్యమా అని.. చిన్న పొరపాటు.. లేదంటే కమ్యునికేషన్ గ్యాప్.. విషయం ఏదైనా సరే.. బతుకు బస్టాండ్ అయ్యే పరిస్థితి. చిన్న పొరపాటుకు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే ప్రమాదం సోషల్ మీడియాలో ఇప్పుడు పొంచి ఉంది. ఏదైనా మనది అని క్లెయిం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక.. ప్రముఖులైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. ఇలాంటి విషయాల మీద పెద్దగా అవగాహన ఉందో లేదో కానీ.. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా బుక్ అయ్యారు. అదెలానంటే..
ఇటీవల ఆయన మామగారు మరణించారు. ఆ సమయంలో తన భార్య సాధనా సింగ్ తన తండ్రిపై ఒక కవితను రాశారు. దాన్ని తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. ఆ కవితను తన భార్య రాసినట్లుగా శివరాజ్ చెప్పుకున్నారు. అయితే.. ఈ కవితను రాసింది మరో మహిళ. మధ్య ప్రదేశ్ కు చెందిన భూమిక అనే మహిళ తాజాగా సీఎం ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ.. గత నెల 21న తన తండ్రి మరణించిన వేళ.. తాను తన ఫోన్ నోట్ ప్యాడ్ లో ఈ కవితను రాసుకొని.. తమ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినట్లు పేర్కొన్నారు.
మొదట్లో ఈ విషయాన్ని పట్టించుకోకున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి తాను రాసిన కవితను చదవనప్పటికీ.. తన భార్య రాసినట్లుగా పేర్కొనటం అబద్దమన్నారు. తనకు ముఖ్యమంత్రి అంటే గౌరవమని పేర్కొన్న భూమిక.. తన కవిత రాసిన ఘనత తనకే దక్కాలన్న ఉద్దేశంతో తప్పించి.. ఈ విషయాన్ని రాజకీయం చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. ఆమె అలా అనుకోకున్నా.. చివరకు అది కాస్తా రాజకీయ రచ్చగా మారింది. వేరే వాళ్లు చేసిన పనులకు తమ పేర్లు మార్చుకొని ప్రజల్ని నమ్మించే అలవాటు బీజేపీకే అంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అరుణ్ యాదవ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఇంతకీ ఈ కవిత వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా మధ్యప్రదేశ్ సీఎం రియాక్టు అవుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.